మాస్కో: అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు(F-16 shot down) రష్యా కమాండర్ ప్రకటించారు. ఆ యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్‌లో కూల్చినట్లు వెల్లడించారు. ఎస్-300 ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీ ఆ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు ఆయన తెలిపారు. రష్యా 1 టీవీకి చెందిన ఇంటర్వ్యూలో ఆ కమాండర్ ఈ విషయాన్ని చెప్పారు. అమెరికా సరఫరా చేసిన ఆ యుద్ధ విమానాన్ని తమ దళం కూల్చిన విమానాల్లో అరుదైనదని అన్నారు. ఎస్-300 బ్యాటరీ నుంచి రెండు మిస్సైళ్లను వదిలామని, వాటి ధాటికి ఎఫ్-16 నేలరాలినట్లు కమాండ్ తెలిపారు. తొలి క్షిపణి విమానాన్ని దెబ్బతీయగా.. రెండో క్షిపణితో దాన్ని చిత్తు చేశామన్నారు.
అయితే ఈ ఆపరేషన్ చేపట్టేందుకు తమకు చాలా సమయం పట్టిందన్నారు. ఆ విమానాన్ని ట్రాక్ చేశామని, కానీ ఆ విమానాన్ని కొట్టడం అసాధ్యం ఏమీ కాదు అని తెలిసినట్లు ఆ కమాండర్ వెల్లడించారు.అయితే ఈ అటాక్ ఎప్పుడు జరిగిందన్న తేదీని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. 2024 ఆగస్టులో ఉక్రెయిన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలు అందాయి.
ఇక ఇప్పటి వరకు ఆ యుద్ధంలో నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలు నేలకూలినట్లు తెలుస్తోంది. యురోపియన్ దేశాల అండతో ఉక్రెయిన్ ఆ యుద్ధ విమానాలు అందుతున్నాయి. 87 జెట్స్ స్థానంలో ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు 44 విమానాలు అందినట్లు తెలుస్తోంది.