వాషింగ్టన్, ఫిబ్రవరి 27: అంతర్జాతీయంగా వాణిజ్యం, నగదు బదిలీలకు అత్యంత కీలకమైన స్విఫ్ట్ నగదు చెల్లింపుల వ్యవస్థ నుంచి రష్యాను తప్పించాలని అమెరికా, ఈయూ నిర్ణయించాయి. రష్యాకు వివిధ దేశాల్లో ఉన్న నిధులను యాక్సెస్ చేయకుండా ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఆంక్షలు విధించిన రష్యా కంపెనీల ఆస్తులను కనిపెట్టడానికి పశ్చిమ దేశాలు సంయుక్తంగా జాయింట్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాయి. స్విఫ్ట్ అంటే సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్(స్విఫ్ట్). ఇది ప్రపంచంలోనే ప్రధాన బ్యాంకింగ్ అనుసంధాన వ్యవస్థ.