న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ రష్యాటుడే(RT India).. ఇప్పుడు ఇండియాలోనూ తన ప్రసారాలను విస్తరించనున్నది. ఆర్టీ ఇండియా ఇంగ్లీష్ ఛానల్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రష్యాటుడే సంస్థ యాడ్ క్యాంపేన్ మొదలుపెట్టింది. ప్రస్తుతం డిజిటల్, ప్రింట్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఆ ప్రచారం సాగుతున్నది. డిసెంబర్లో ఆ ఛానల్‌ను లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రష్యాటుడేకు చెందిన యాడ్స్ ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఓ పాత స్నేహితుడి కొత్త స్వరం అన్న టైటిల్‌తో యాడ్ క్యాంపేన్ కొనసాగుతున్నది. కేవలం భారతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని వారి కోసం డిజైన్ చేసిన అంశాలతో ఛానల్‌ను నిర్వహించనున్నారు.
వ్యాపార, సాంస్కృతిక, దౌత్య అంశాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే దేశంలోని మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలో రష్యాటుడే యాడ్స్‌ను డిస్ప్లే చేస్తున్నారు. ప్రింట్, ఆన్లైన్ ఎడిషన్స్‌లోనూ ఆ ఛానల్‌కు చెందిన వాణిజ్య ప్రకటనలు ఇస్తున్నారు.
ఆర్టీ క్యాంపేన్‌లో భాగంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు, నోయిడా, కోల్‌కతా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. హై ఇంపాక్ట్ ఎల్ఈడీ స్క్రీన్లపై 5డీ విజువల్స్‌తో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఢిల్లీ మెట్రో లో ప్రత్యేకంగా రైలు సిద్ధంగా చేశారు. సమయ్‌పూర్ బద్లీ నుంచి మిలినియం సిటీ సెంటర్ వరకు వెళ్లే ఎల్లో లైన్ మార్గంలో ఓ రైలును పూర్తిగా ఆర్టీ యాడ్స్‌తో నింపేశారు. ఆ రైలు 37 స్టేషన్లలో ఆగుతూ సుమారు 47 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రష్యా-ఇండియా ఫ్రెండ్షిప్ థీమ్‌తో ఆ రైలును అలంకరించారు.
Spotted at Rajiv Chowk! 📍 RT India’s Indo-Russian Museum metro is creating quite a buzz! People are actually enjoying their commute for once 😄 #IndoRussianMuseum pic.twitter.com/G0xOSaB2OW
— Suresh Parmar® (@iamSureshParmar) November 19, 2025