కాందహార్ విమానాశ్రయంపై రాకెట్ల దాడి
కాందహార్ విమానాశ్రయం | దక్షిణ ఆఫ్ఘనిస్తాలోని కాందహార్ విమానాశ్రయంపై తాలిబాన్లు మూడురాకెట్లతో దాడులకు పాల్పడ్డారు. రెండు రాకెట్లు ఎయిర్పోర్ట్ రన్‌వేపై

కాబూల్ : దక్షిణ ఆఫ్ఘనిస్తాలోని కాందహార్ విమానాశ్రయంపై తాలిబాన్లు మూడురాకెట్లతో దాడులకు పాల్పడ్డారు. రెండు రాకెట్లు ఎయిర్పోర్ట్ రన్‌వేపై పడడంతో ధ్వంసమైంది. దీంతో విమానాశ్రయం నుంచి అన్ని విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ చీఫ్ మసౌద్ మష్తున్ తెలిపారు. రన్‌వే మరమ్మతులు జరుగుతున్నాయని, త్వరలోనే విమానాశ్రయం పని చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, రాకెట్ దాడిని కాబూల్‌లోని ఏవియేషన్ అథారిటీ ధ్రువీకరించింది. గత కొన్ని వారాలుగా తాలిబాన్లు కాందహార్ శివారుల్లో దాడులు జరుపుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో కాందహార్ రెండో పెద్ద నగరం కాగా.. ఆ దేశానికి లాజిస్టిక్స్, ఎయిర్ సపోర్ట్ అందించడంలో ఈ ఎయిర్ బేస్ కీలకమైంది. పశ్చిమాన హెరాత్, దక్షిణాన లష్కర్ గాహ్ రెండు ఇతర ప్రాంతీయ రాజధానులను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా బలగాల ఉపసంహరణ చివరి దశలో.. ఇటీవలి వారాల్లో తాలిబాన్లు ప్రావిన్స్ రాజధానులపై కన్నేశారు. అలాగే కీలక సరిహద్దులను స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే, రాకెట్ దాడిలో నష్టానికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి..
కర్ణాటక వెళ్తే ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ తప్పనిసరి.. ఎవరికంటే?
నైట్ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడ? ఎప్పటి వరకంటే?
Nagarjuna sagar Dam । నేడు సాగర్ గేట్ల ఎత్తివేత
Covid-19 : దేశంలో కొనసాగుతున్న మహమ్మారి ఉధృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

