లండన్, ఫిబ్రవరి 13: మానవ హృదయ కండర కణాలతో రోబో చేపను అమెరికాలోని కేంబ్రిడ్జి వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్లాస్టిక్‌తో రెక్కలు, పేపర్‌తో వెన్నెముక తయారుచేసి, శరీరాన్ని కణాలతో రూపొందించారు. అసలైన చేపలా ఈ రోబో ఈదగలుగుతున్నదని పరిశోధకులు తెలిపారు. ఇరువైపులా ఉండే కణాల్లో ఒక వైపు కణాలు సంకోచించినప్పుడు, మరోవైపు కణాలు వ్యాకోచిస్తాయి.