H1N1 Cases | ఢిల్లీలో తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఢీల్లీ-NCR H1N1 కేసులు, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎక్కువవుతున్నాయి. డాక్టర్లతో సహా కొంతమంది వ్యక్తులకు H1N1 పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. కొంతమంది పేషెంట్లలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి. శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, తగ్గని జ్వరం, పెదవులు బ్లూ కలర్లోకి మారడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని డాక్టర్లు కోరుతున్నారు. గర్భిణులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి H1N1 (Swine flu) సోకే అవకాశం ఉందని, వారు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఇదే కాలంలో గతేడాది 229 కేసులు నమోదు కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1349 H1N1 కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు. వ్యాధి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోపు చికిత్స తీసుకోవడం మంచిది అని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. తేమతో కూడిన వాతావరణం ఉన్నందున ప్రజలు ఇన్ఫ్లూయెంజా టీకా తీసుకోవాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దగ్గేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించాలని వారు సూచిస్తున్నారు.