కాంతార సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు కన్నడ హీరో రిషభ్ షెట్టి. ఈ ఏడాది కేజీఎఫ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా కాంతార రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ప్రాంతీయ బాలీవుడ్లో హిట్ సినిమాలు రాకపోవడం గురించి రిషభ్ స్పందించాడు. బాలీవుడ్ సినిమాల మీద పశ్చిమ దేశాల ప్రభావం ఎక్కువ. దాంతో, ఆ సినమాల్లోని విజ్యువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వంటి వాటిని హిందీ సినిమాల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వాటిని హాలీవుడ్ సినిమాల్లో జనం చాలా చూస్తున్నారు. హాలీవుడ్ సినిమాల్లో కథ, కథనంతో పాటు క్వాలిటీ కూడా బాగుంటుంది అని ప్రస్తావించాడు ఈ కన్నడ హీరో.
నోటి ప్రచారంతో హిట్ టాక్
కాంతార సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు రిషభ్ షెట్టి. కర్నాటకలోని తీర ప్రాంత ప్రజల సంస్కృతి ఇందులో కనిపిస్తుంది. ఈ సినిమా విజయానికి నోటి ప్రచారం బాగా హెల్ప్ చేసింది. 16 కోట్లతో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 325 కోట్లు వసూళ్లు రాబట్టింది. హిందీ సినిమా సెలబ్రిటీలు కూడా కాంతార సినిమా స్క్రీన్ ప్లే సూపర్ అని మెచ్చుకున్నారు కూడా.