మీ ధాన్యం వద్దు.. దాడులూ వద్దు!
రేవంత్ సర్కార్‌పై రైస్‌మిల్లర్లు తిరుగుబావుటా ఎగరేశారు. ప్రభుత్వ అసంబద్ధ నిబంధనలు, సివిల్ సప్లయ్, విజిలెన్స్ ఆకస్మిక దాడుల పేరిట జరుగుతున్న వేధింపులే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది.
- సర్కార్‌పై మిల్లర్స్ అసోసియేషన్ల జంగ్
- వడ్లు దించుకునేందుకు రైస్‌మిల్లర్లు ససేమిరా
- తమకు అప్పగించొద్దంటూ కలెక్టర్లకు లేఖలు
- యాదాద్రి,నల్లగొండ, మెదక్‌లో మిల్లర్ల నిర్ణయం
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రేవంత్ సర్కార్‌పై రైస్‌మిల్లర్లు తిరుగుబావుటా ఎగరేశారు. ప్రభుత్వ అసంబద్ధ నిబంధనలు, సివిల్ సప్లయ్, విజిలెన్స్ ఆకస్మిక దాడుల పేరిట జరుగుతున్న వేధింపులే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. అందుకే ‘మాకు మీ ధాన్యం వద్దు.. మీ వేధింపులూ వద్దు’ అంటూ నిరాకరిస్తున్నారు. తమకు ధాన్యం కేటాయించవద్దని ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారికంగా లేఖలు ఇస్తున్నాయి. ఇప్పటికే భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ధాన్యం దించుకోవద్దని నిర్ణయంచారు. ముఖ్యంగా భువనగిరి జిల్లా రైస్‌మిల్లర్లు ఏకంగా హైకోర్టునే ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. తమ వద్ద ఉన్న పెండింగ్ ధాన్యం క్లియర్ అయ్యేవరకు కొత్తవి ఇవ్వకుండా సివిల్సప్లయ్ను ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు. ఇదే బాటలో మిగిలిన జిల్లాల మిల్లర్లూ ఉన్నారని, సమావేశాలు నిర్వహించుకుంటున్నట్టు సమాచారం. ఓ వైపు కల్లాల్లో ధాన్యం రాశులు పోసి కొనుగోళ్లు కోసం రైతులు కండ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్న తరుణంలో మిల్లర్లు ధాన్యం దించుకొనేందుకు ససేమిరా అనడం సర్కార్‌కు సవాల్‌గా మారింది.
సర్కార్ అసంబద్ధ విధానాల వల్లే..
కొంతకాలంగా మిల్లర్లపై సివిల్ సప్లయ్ కొరడా ఝులిపిస్తున్నది. సీఎమ్మార్ బకాయిలు, ధాన్యం షార్టేజీపై ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నది. ఓ వైపు సివిల్ సప్లయ్ అధికారులు, మరోవైపు విజిలెన్స్ అధికారులు ఒకేసారి ముప్పేట దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో మిల్లర్ల అక్రమాలు బయటపడుతున్నాయి. ధాన్యం లేకపోవడం, సీఎమ్మాఆర్ బకాయిలు పేరుకుపోవడం లాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు బాధ్యులను చేస్తూ పలువురు మిల్లర్లను అరెస్ట్ జైలుకు కూడా పంపారు. అయితే ఈ దాడులన్నీ కక్షపూరితమేనని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు, తమ సమస్యలను పట్టించుకోకుండా ఏకపక్షంగా దాడులు చేస్తూ వేధిస్తున్నట్టు వాపోతున్నారు. ఈ దాడులకు వ్యతిరేకంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మిల్లులను బంద్ చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు కూడా నిర్వహించారు. వీటిపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మిల్లర్ల సంఘం ప్రతినిధులు జరిపిన చర్యలు సైతం విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో మిల్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకొని ఇబ్బందులు ఎదుర్కోవడం కన్నా.. తీసుకోకుండా ఉంటేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ధాన్యం తీసుకున్న తర్వాత తనిఖీల పేరుతో వేధింపులు, కేసులు పెట్టడం, జైలుకు పంపడం వంటి చర్యలు చేపట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎమ్మాఆర్ ధాన్యం జోలికి వెళ్లొద్దనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
కొనుగోళ్లపై ప్రభావం.. ఇబ్బందుల్లో రైతులు
ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చినట్టు సివిల్ సప్లయ్, మిల్లర్ల పోరులో రైతులు నలిగిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని దించుకోవద్దనే మిల్లర్ల నిర్ణయంతో రైతులు, ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నది. ఒక దశలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నది. కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తేనే, కొత్తగా వచ్చే రైతుల ధాన్యం కొనుగోళ్లకు వీలవుతుంది. కానీ, మిల్లర్లు సహకరించకపోవడంతో లారీల లోడింగ్ ఎకడికకడ నిలిచిపోయింది. ఫలితంగా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోతున్నాయి. ఇప్పటికే కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. మరోవైపు, సన్న వడ్లకు మద్దతు ధర దకక, మిల్లర్లు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించడంతో నల్లగొండ వంటి జిల్లాల్లో అన్నదాతలు రోడ్లపై నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పుడు మిల్లర్లు ఏకంగా సీఎంఆర్ ధాన్యాన్నే బహిషరించడంతో, సేకరణ ప్రక్రియ పూర్తిగా స్తంభించే ప్రమాదం ఏర్పడింది.
ప్రణాళిక లోపమే శాపమా?
అయితే మిల్లర్లతో నెలకొన్న సమస్యకు సివిల్ సప్లయ్ అధికారుల ముందుస్తు ప్రణాళిక లేకపోవడమే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా సీజన్ ప్రారంభానికి ముందే మిల్లర్ల సంఘాలతో చర్చించి, వారి సమస్యలను పరిషరించాలి. తద్వారా కొనుగోళ్లకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఈ విషయంలో ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ ఘోరంగా విఫలమయ్యాయనే విమర్శలున్నాయి. కేవలం దాడులు, కేసుల పేరుతో హడావుడి చేయడం తప్ప.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వచేసే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై యంత్రాంగం దృష్టిసారించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరార్, మిల్లర్ల మధ్య నడుస్తున్న ఈ ‘పంతం’ చివరికి ఆరుగాలం కష్టపడి పండించిన రైతు మెడకు ఉరితాడవుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

