సిరిసిల్లకు బయలుదేరిన డీఆర్ఎఫ్ బృందాలు
సిరిసిల్లకు బయలుదేరిన డీఆర్ఎఫ్ బృందాలు | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీగా వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. కరీంనగర్ - కామారెడ్డి రహదారితో పాటు వెంకంపేట రోడ్‌పై వరద ప్రవహిస్తోంది. పలు

హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీగా వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. కరీంనగర్ – కామారెడ్డి రహదారితో పాటు వెంకంపేట రోడ్‌పై వరద ప్రవహిస్తోంది. పలు కాలనీలు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో వరద పరిస్థితిపై రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ వర్షాల దృష్ట్యా రాజన్న సిరిసిల్లకు డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు రెండు బృందాలు హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బయలుదేరి వెళ్లాయి. ఈ బృందాలు వరద సహాయక చర్యలు చేపట్టనున్నాయి.

కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్ వరదల దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వరద ముంపునకు గురైన ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం 8.30 గంటల వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా వేములవాడలో 213 మిల్లీమీటర్లు, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 174 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది టీఎస్‌డీపీఎస్ తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

