సాగుకు నేను చుక్కనీరూ ఇవ్వలేను
‘ఎల్ నినో వస్తున్నది. తాగడానికే నీళ్లు లేవు. సాగుకు చుక నీరివ్వలేం. కరెంట్ లేదు. సాగుబడి ఆపండి. ఏసీలు బంద్ చేసుకోండి. ఇంట్లో కూర్చోండి’ అంటూ రాష్ట్రంలో కరువుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాభవన్ వేదికగా చేతులెత్తేశారు. ఎండలు ముదిరితే ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదని, రాబోయే 8 నుంచి 10 నెలలు అత్యంత గడ్డుకాలమని స్వయంగా ప్రజలను భయపెట్టారు.
- తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. తీవ్ర గడ్డుకాలం తప్పదు
- కరెంటు కొనలేం, ఏసీలు బంద్ చేసుకోండి: ముఖ్యమంత్రి రేవంత్
- కరువుకు ముందే హ్యాండ్సప్.. ప్రజలకు భరోసా ఇవ్వలేక రాజకీయం
- నివారణ చర్యలు పక్కనబెట్టి.. మాజీ సీఎంపై మళ్లీ అవే ప్రేలాపనలు
మొన్న
వాళ్లకు (సూపర్ ఎల్ నినోపై హెచ్చరిస్తున్న వాతావరణశాఖ అధికారులకు), వీళ్లకు (కాళేశ్వరం నీళ్లు ఎందుకు ఎత్తిపోయొచ్చునన్న ఇరిగేషన్ ఇంజినీర్లకు), తెలివితేటలు ఎక్కువైనయ్. వాళ్లిద్దరూ అబద్ధాలు చెప్తున్నరు. ఇద్దరికీ బెల్ట్ ట్రీట్మెంట్ ఇయ్యాలె. అయితేగానీ వాళ్లు దారిలో పడరు.
– గత జూలై 11వ తేదీన మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు
నిన్న
ఇది తీవ్రమైన కరువు. రాబోయే ఎనిమిది, పది నెలలు తీవ్ర గడ్డుకాలం తప్పదు. రాష్ట్రంలో తాగడానికే నీళ్లు లేవంటే.. వ్యవసాయానికి నీళ్లివ్వడం అసలే కుదరదు. కావాలంటే కూరగాయలు పండించుకోండి. కరెంటు కొనలేము. పగటిపూట ఒక్క ట్యూబ్‌లైట్ కూడా వెయ్యకండి. ఏసీలను తగ్గించుకోండి.
– శుక్రవారం నాడు మీడియాతో సీఎం రేవంత్
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : ‘ఎల్ నినో వస్తున్నది. తాగడానికే నీళ్లు లేవు. సాగుకు చుక నీరివ్వలేం. కరెంట్ లేదు. సాగుబడి ఆపండి. ఏసీలు బంద్ చేసుకోండి. ఇంట్లో కూర్చోండి’ అంటూ రాష్ట్రంలో కరువుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాభవన్ వేదికగా చేతులెత్తేశారు. ఎండలు ముదిరితే ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదని, రాబోయే 8 నుంచి 10 నెలలు అత్యంత గడ్డుకాలమని స్వయంగా ప్రజలను భయపెట్టారు. ఈ మేరకు శుక్రవారం ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపలేరని, అప్రమత్తతతోనే బయటపడాలని చెప్తూనే ‘ఇది క్యాన్సర్ లాంటి నిజం, ప్రజలకు ముందే చెప్పకపోతే నష్టపోతాం’ అంటూ నిస్సహాయతను వ్యక్తంచేశారు. తన చేతగానితనాన్ని సమర్థించుకోవడానికి మళ్లీ కేసీఆర్ మీద నోరుపారేసుకున్నారు. కరోనా గురించి నాటి సీఎం కేసీఆర్ అబద్ధం చెప్పారని, కానీ తాను నిజం చెప్తున్నానంటూ జబ్బలు చరుచుకున్నారు. ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వాధినేతగా ప్రజలకు భరోసా ఇస్తూ, కొండంత అండగా నిలువాలి తప్ప, ఇలా సంక్షోభం రాకముందే సీఎం రేవంత్‌రెడ్డి తన బాధ్యత నుంచి తప్పించుకుంటూ ప్రకటనలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్నదాతల వెన్నులో వణుకు
ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, వ్యవసాయానికి సాగునీటిపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అన్నదాతల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో 20 శాతం నీటి నిల్వలు కూడా లేవని, మొత్తం నిల్వలు 200 టీఎంసీలకు మించి లేకపోవడంతో దాదాపు అన్ని జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరాయని సీఎం చెప్పుకొచ్చారు. వచ్చే నాలుగు నెలలపాటు పంటలకు చుక నీరు కూడా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. తాగడానికే నీళ్లు లేనప్పుడు పంటలకు సాగునీరు ఎకడి నుంచి తెచ్చి ఇస్తామని ఎదురు ప్రశ్నించారు. కాగా సీఎం వ్యాఖ్యలపై నిపుణులు, ప్రజలు మండిపడుతున్నారు. ఎల్ నినోతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ నెలల క్రితమే హెచ్చరించినప్పుడు నీటిపారుదల శాఖ నిద్రపోయి, ఇప్పుడు చేతులెత్తేయడమేందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వర్షాకాలంలో కాళేశ్వరం నుంచి నీటిని తోడుకొని చెరువులు నింపుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేదే కాదని అంటున్నారు. తీరా పంటలు పొట్టదశకు వచ్చే అత్యంత కీలకమైన సమయంలో సాగుకు నీళ్లు బంద్ అని ప్రకటించి, రైతులను అగాధంలోకి నెట్టేయడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పంపుసెట్ల పరిస్థితిని సీఎం వివరిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 లక్షల బోర్లలో ఇప్పటికే దాదాపు 15 లక్షలు పూర్తిగా ఎండిపోయాయని చెప్పారు. అంతేగానీ ఎలాంటి నివారణ చర్యలపైనా స్పష్టత ఇవ్వలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోయి, రూ.వేలల్లో అప్పులు తెచ్చి పంటలు వేసిన రైతులు దికుతోచని స్థితిలో ఉంటే.. రైతు వేదికల్లో కౌన్సిలింగ్ ఇచ్చి ఆరుతడి పంటలు, కూరగాయలు మాత్రమే వేయించాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం ఆదేశాలు ఇవ్వడం సమస్యను మరింత తీవ్రతరం చేయడమేనని మండిపడుతున్నారు. ఎండిన బోర్ల కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏమైనా తాతాలిక మోటర్లు, ఉమ్మడి బోర్లు, నష్టపరిహారం ప్యాకేజీలు ఇస్తుందా? అని ఎదురుచూడగా, ఆ ఊసే ఎత్తలేదు. పంట చేతికి రాని రైతులకు ఆర్థిక భరోసా కల్పించకుండా, కేవలం ఆరుతడి పంటలు వేసుకోండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపుకోవడంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది.
మళ్లీ కేసీఆర్ జపం
రాష్ట్రంలోని ప్రస్తుత సమస్యలను సమర్థంగా పరిషరించడాన్ని పకనబెట్టి, గత పాలకులను నిందించే రాజకీయాలకే సీఎం ప్రాధాన్యమిచ్చారు. కరోనా మహమ్మారి సమయంలో మాసులు వద్దని, పారాసిటమాల్ వేసుకోమని కేసీఆర్ చెప్పారని, ఆ మాటలు నమ్మి మాసులు పెట్టుకోని ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి శ్మశానాల్లో స్థలం లేని దుస్థితి వచ్చిందని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ మాటలు నమ్మని తామంతా నేడు ప్రాణాలతో ఇకడ కూర్చున్నామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నిపుణులు మండిపడుతున్నారు. కరోనా విపత్తును ఎదుర్కోవడంలో కేసీఆర్ చూపించిన చొరవలో 10 శాతం చూపించినా రాష్ట్రంలో ఇప్పుడు ఎల్ నినో ప్రభావం ఉండేదే కాదని స్పష్టంచేస్తున్నారు. తీవ్ర కరువుపై చర్చించాల్సిన సమయంలో కేసీఆర్‌ను విమర్శించడం, శ్మశానాల ప్రస్తావన తేవడం వంటివి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గ్రామాల్లో పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న సీఎం సూచన మంచిదే అయినా, వాటికి నిధులు ఎకడి నుంచి వస్తాయో మాత్రం స్పష్టం చేయలేదు. ఇప్పటికే తీవ్ర నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీల మీదే ఈ భారాన్ని తోసేస్తే, ఆ కేంద్రాలు ఎలా నడుస్తాయి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరువు బారిన పడిన పల్లెలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయకుండా, కేవలం ఆదేశాలు జారీ చేసి సరిపెట్టుకోవడం పాలనా డొల్లతనానికి నిదర్శనమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ నాటి భరోసా ఇప్పుడున్నదా?
వడ్ల ధరలు పెరిగితే బియ్యం ధరలు పెరుగడం సహజ ఆర్థిక సూత్రమని, ఈ చిన్న విషయం ఆయనకు తెలియదా? అని రేవంత్‌రెడ్డి ఎదురుదాడికి దిగారు. బీఆర్ఎస్ చేసే ఆరోపణలను ఎండగట్టే ఓపిక తమ నేతలకు లేకపోవడం వల్లే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని వాపోయారు. తాము మౌనంగా ఉంటే ప్రజలు దాన్ని అర్ధాంగీకారంగా భావిస్తారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లి నిజాలు చెప్పకపోతే ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. అయితే మారెట్లో బియ్యం ధరలు పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంటే, నిత్యావసరాల ధరలను అదుపు చేయాల్సిన బాధ్యతను గాలికొదిలేసి, ధరలు పెరుగడం సహజమేనని సమర్థించుకోవడం ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రజలు తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుందనే కొండంత ధైర్యా న్ని ఇవ్వాలని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. నాడు కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసినప్పుడు కూడా ‘మా సీఎం ఉన్నా డు. కరోనా నుంచి కాపాడుతాడు’ అని సామాన్యులు కూడా భరోసాతో చెప్పుకొన్నారు.
నాడు రూ.5.64 పెడితే నేరం.. ఇప్పుడు రూ.15 పెట్టినా కాదట
మారెట్లో యూనిట్‌కు రూ.15 పెట్టి నా కరెంట్ దొరుకడం లేదని, బ్యాంకు ల్లో అప్పులు తెచ్చి విద్యుత్తు కొనడానికి సిద్ధపడినా ఎకడా లభ్యత లేదని సీఎం రేవంత్‌రె డ్డి ప్రకటించారు. ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడాలని, ఏసీల వాడకం తగ్గించుకోవాలని, ప్రభుత్వ ఆఫీసుల్లో కఠిన పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు. దీంతో ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తామని, గృహాలకు ఉచిత విద్యుత్తు అందిస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చిన నేతలు, ఇప్పుడు ఏసీలు బంద్ చేసుకోవాలని పిలుపు ఇవ్వడపై ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తొలి రోజుల్లో తీవ్రమైన అంధకారం, పవర్ హాలిడేలు, రైతుల ఆందోళనలతో సంక్షోభంలో కూరుకుపోయిన విద్యు త్తు రంగాన్ని బాగు చేయటానికి నాటి సీఎం కేసీఆర్ ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సరఫరా చార్జీలు కలిపి యూనిట్‌కు రూ.5.64 వరకు చెల్లించి, రాష్ర్టాన్ని అంధకారం నుంచి గట్టెకించారు. సంక్షోభాన్ని అధిగమించడానికి రూ.5.64 ఖర్చు చేయడాన్నే మహానేరంగా, అవినీతిగా చిత్రీకరిస్తూ రేవంత్ సరార్ విచారణ కమిషన్ వేసి, రచ్చ చేసింది. నాటి ఖర్చును కమీషన్ల కోసమన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తాను ‘యూనిట్‌కు రూ.15 పెట్టినా, అప్పులు తెచ్చినా కరెంట్ దొరుకట్లేదు’ అని చెప్పడంపై ప్రజలు ఫైర్ అయ్యారు.
ఇప్పుడూ ఎన్నికల యావే
ఇంతటి క్లిష్ట సమయంలో కూడా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం అంతా ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టూనే తిరుగడం గమనార్హం. ఎమ్మె ల్సీ ఎన్నికలు అభ్యర్థులకు మాత్రమే సంబంధించినవి కావని, అవి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు సంబంధించినవని ఉద్ఘాటించారు. ఎన్నికలు లేని జిల్లాల మంత్రులు, ముఖ్యనేతలకూ బాధ్యతలు అప్పగించి అభ్యర్థులను గెలిపించి తీరాలని దిశానిర్దేశం చేశారు. తాగు, సాగునీరు, విద్యుత్తు లేక ప్రజలు, రైతులు హాహాకారాలు చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం రాజకీయాలు, ఎన్నికల గెలుపోటములపైనే సమీక్షలు జరుపుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

