ఢిల్లీ,జూలై 6: ఆదాయపు పన్ను దరఖాస్తులు దాఖలు చేయడానికి మరింత సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సి.బి.డి.టి). ఎలక్ట్రానిక్ విధానంలో 15 సి.ఏ. / 15 సి.బి. ఆదాయపు పన్ను దరఖాస్తులనుwww.incometax.gov.in పోర్టల్ లో దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా పన్నుచెల్లింపుదారులు తమ 15 సి.ఏ. / 15 సి.బి. ఫారాలను అధీకృత డీలర్ కు మాన్యువల్ ఫార్మాట్ లో జూన్ 30 వరకు సమర్పించవచ్చని గతంలో సి.బి.డి.టి. నిర్ణయించింది.
ఇప్పుడు ఆ గడువును జూలై15 వరకు పొడిగించాలని ఇప్పుడు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఈ ఫారాలను మాన్యువల్ ఫార్మాట్ లో జూలై 15 తేదీ వరకు అధీకృత డీలర్లకు సమర్పించవచ్చు. విదేశీ చెల్లింపుల ప్రయోజనం కోసం జూలై 15వ తేదీ వరకు ఇటువంటి ఫారాలను అంగీకరించాలని అధీకృత డీలర్లకు సూచించారు. డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ను రూపొందించడం కోసం ఈ ఫారాలను తరువాతి తేదీలో అప్-లోడ్ చేయడానికి వీలుగా కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ లో తగిన సౌకర్యాన్ని కల్పించారు.
ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం, ఫారం 15 సి.ఎ. / 15 సి.బి. లను ఎలక్ట్రానిక్ విధానం ద్వారా అందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు ఫారం 15 సి.బి. లో చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికెట్ తో పాటు ఫారం 15 సి.ఏ. ని ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ-ఫైలింగ్ పోర్టల్ లో ఏదైనా విదేశీ చెల్లింపుల కోసం అధీకృత డీలర్ కు కాపీని సమర్పించే ముందు అప్-లోడ్ చేస్తారు.