Redmi Turbo 5 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ భారత మార్కెట్లోకి కొత్త సిరీస్‌ను ప్రవేశపెట్టింది. రెడ్మీ టర్బో 5 స్మార్ట్‌ఫోన్ విక్రయాలను భారత్‌లో ప్రారంభించింది. టర్బో సిరీస్‌లో ఇక్కడ రిలీజైన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. 7540mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రాప్రాసెసర్తో పాటు అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ మొబైల్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
రెడ్మీ టర్బో 5 మొబైల్ ప్రస్తుతం రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.37,999గా నిర్ణయించింది. ఇక 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.40,999గా ఖరారు చేసింది. ప్రారంభ ఆఫర్లో భాగంగా ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.2వేల వరకు తక్షణ రాయితీని అందిస్తోంది. ఈ మొబైల్ ప్రముఖ ఈకామర్స్ వెబ్సైట్ అమెజాన్, Mi.comతో పాటు షావోమీ ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఆస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూ, టర్బో వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.
ఈ మొబైల్లో 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను అందించారు. 120Hz అడాప్టివ్‌సింక్ రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్‌పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ సపోర్టు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అదనంగా IP66, IP68, IP69K రేటింగ్‌తో ధూళి, నీటి తుంపరల నుంచి మెరుగైన రక్షణ లభిస్తోంది.
పనితీరు విషయానికి వస్తే ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్‌ను అమర్చారు. LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఇందులో 3డీ ఐస్‌లూప్ కూలింగ్ సిస్టమ్, గేమ్ టర్బో వైల్డ్ బూస్ట్ ఆప్టిమైజేషన్ ఫీచర్లను జోడించారు. దీనివల్ల ఎంతసేపు గేమ్స్ ఆడినా ఫోన్ వేడెక్కకుండా ఉంటుందని షావోమీ కంపెనీ చెబుతోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ ఆధారిత ఫీచర్లకు కూడా ప్రాధాన్యమిచ్చారు. గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్, హైపర్ కనెక్ట్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు నాలుగేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్లు, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని షావోమీ ప్రకటించింది.
రెడ్మీ టర్బో 5 స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రధాన కెమెరాతో పాటు 87మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్‌ను అందించారు. మెయిన్ కెమెరాక ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టు ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 20మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. దీంతో 4K వీడియో రికార్డింగ్, టర్బో స్నాప్ బర్స్ట్ ఫొటోగ్రఫీ, ఏఐ ఆధారిత ఫొటో ఎడిటింగ్ ఫీచర్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ఈ ఫోన్లో 7540mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది 100W హైపర్ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. అలాగే 27W రివర్స్ వైర్డ్ చార్జింగ్ సదుపాయం కల్పించారు. కనెక్టివిటీ కోసం 5G, 4G, LTE, Wifi 7, Bluetooth 6.0, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, హై రెస్ ఆడియా సపోర్టు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఇందులో కలవు.