టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Ravi Teja) క్రాక్ సక్సెస్ తర్వాత యమ స్పీడుమీదున్నాడు. హిట్టు కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు క్రాక్ రూపంలో బ్లాక్ బాస్టర్ ఇచ్చి వారి ఆకలి తీర్చాడు. ఇపుడేమో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పక్కా ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఖిలాడీ బాక్సాపీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ ధమాకా (Dhamaka) అనే మరో సినిమా చేస్తున్నాడు.
హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ లొకేషన్ లో తీసిన స్టిల్ ఒకటి రవితేజ నెట్టింట్లో పోస్ట్ చేయగా..ట్రెండింగ్ అవుతోంది. షూటింగ్ విరామంలో రవితేజ ఛైర్‌పై కూర్చొని తన స్మార్ట్ ఫోన్‌ను చెక్ చేస్తూ బిజీగా ఉండటం స్టిల్‌లో చూడొచ్చు. పెళ్లి సందD ఫేం శ్రీలీల ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
బీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మాస్ మహారాజా మరోవైపు కొత్త దర్శకుడు శరత్ మండవతో కలిసి రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. మరోవైపు సుధీర్ శర్మ (Sudheer Varma) దర్శకత్వంలో 70వ (Ravi Teja 70) ప్రాజెక్టును చేస్తున్నాడు రవితేజ.