Srisailam Temple | రావణ వాహనంపై మల్లన్న విహారం
Srisailam temple | దసరా మహోత్సవాలు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన

శ్రీశైలం : దసరా మహోత్సవాలు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం భ్రమరాంబ చంద్రఘంటాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రఘంటా సమేతుడైన మల్లికార్జునుడు రావణ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. చండీ, దుర్గ, కాళి, లలితార్చన జరిగాయి. సాయంత్రం చంద్రఘంటాదేవి అలంకరణలో అమ్మవారు ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అర్చక వేదపండితులు పూజలు నిర్వహించారు. మండపంలో ఏర్పాటు చేసిన వాహనసేవపై ఆసీనులైన స్వామిఅమ్మవార్లకు పూజలు చేపట్టారు.

అనంతరం ఆలయ మాడవీధుల్లో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. చంద్రఘంటా దేవి సమేతుడైన శ్రీశైలేశుడు రావణ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించాడు. ఆలయ ప్రాకారోత్సవంలో ఈవో లవన్న, ఈఈ బాలమురళీకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ నటరాజ్, ఆలయ పర్యవేక్షకులు శ్రీహరి, పౌరసంబంధాల అధికారి శ్రీనివాస్‌రావు, శ్రీశైల ప్రభ ఎడిటర్ అనికుమార్, ఏఈఓ హరిదాస్, మల్లయ్య, సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, అయ్యన్న, రవికుమార్, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. ఉత్సవాల సందర్భంగా భ్రామరి కళావేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
రేపు కూష్మాండ దుర్గ అలంకారంలో..
శరన్నవరాత్రుల్లో నాల్గవ రోజు భ్రమరాంబాదేవి అమ్మవారు కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మల్లికార్జునుడు కైలాస వాహన సేవపై నుంచి భక్తులను అనుగ్రహిస్తాడని ఈవో లవన్న చెప్పారు. కూష్మాండ దుర్గను ఉపాసంచడంతో రోగాలు, శోకాలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరి ఆయువు యశస్సు వృద్ధి చెందుతుందని భక్తుల విశ్వాసం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

