Mysaa | రష్మిక మందన్న ‘మైసా’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న రావడం లేదని మేకర్స్ ప్రకటన!
Mysaa | నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మైసా' విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని తొలుత నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.
Mysaa | నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మైసా’ విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని తొలుత నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే, తాజాగా ఈ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
‘మైసా’ ప్రపంచాన్ని ఎటువంటి రాజీ లేకుండా అత్యుత్తమ నాణ్యతతో, సినిమాకు తగిన గొప్ప అనుభూతిని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ దార్శనికతతో నవంబర్ 27న జరగాల్సిన థియేట్రికల్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. కొత్త రిలీజ్ డేట్ వచ్చేలోపు అభిమానులు ఆ ఉత్సాహాన్ని అలాగే కొనసాగిస్తూ, చిత్రంలోని జోష్ నింపే ‘ఓసే రాములమ్మ’ పాటను ఆస్వాదించాలని మేకర్స్ కోరారు. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను అన్‌ఫార్ములా ఫిల్మ్స్, టీ-సిరీస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వాయిదా వార్తతో అభిమానులు కొంత నిరాశకు గురైనప్పటికీ, నాణ్యత విషయంలో రాజీ పడకుండా సినిమాను తీసుకువస్తున్నారన్న అంశం పట్ల ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | రష్మిక మందన్న ‘మైసా’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న రావడం లేదని మేకర్స్ ప్రకటన!
Vijay and Sangeetha | అనిరుధ్, కావ్య గ్రాండ్ రిసెప్షన్.. వేర్వేరుగా వచ్చి జంటను ఆశీర్వదించిన సీఎం విజయ్, సంగీత!
SRK | 9 ఏళ్ల వయసులో కసబ్‌పై సాక్ష్యం చెప్పే ధైర్యం ఎలా వచ్చింది?.. 26/11 బాధితురాలిని ప్రశ్నించిన షారుఖ్ ఖాన్!
IND vs NZ | పంత్ సెంచరీ.. న్యూజిలాండ్‌పై భారత్ పట్టు.. చివరి రోజు 8 వికెట్లు తీస్తే చాలు!
Vrushakarma | రిలీజ్ వాయిదా రూమర్లకు చెక్.. వృశకర్మ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

