వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ నాయికగా నటిస్తున్నది. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ సంస్థ నిర్మిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో దర్శకుడు గిరీశాయ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్నది. ఈ నేపథ్యంలో బుధవారం ‘రంగ రంగ వైభవంగా’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జూలై 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపారు. ‘ప్రేమ, వినోదం కలిసిన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించాం. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటకు మంచి స్పందన వస్తున్నది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. జూలై 1న మీ ముందుకు సినిమాను తీసుకొస్తాం’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్, సంగీతం : దేవిశ్రీప్రసాద్.