టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తన అప్ డేట్స్ ఎప్పటికపుడు సోషల్‌మీడియాలో షేర్ చేసుకుంటుందనే సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ ఇప్పుడెక్కడుందో తెలుసా..? నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఫొటో చూస్తే లొకేషన్‌పై క్లారిటీ వస్తుంది. రకుల్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నాని (Jaccky Bhagnani)తో కలిసి ఆగ్రా (Agra)కు వెళ్లింది. ఇంతకీ స్పెషల్ ఏంటనే కదా మీ డౌటు. ప్యార్ కా పంచ్‌నామా డైరెక్టర్ లవ్ రంజన్ వెడ్డింగ్‌కు హాజరైంది రకుల్. ఆగ్రాలోని ప్లష్ హోటల్లో లవ్ రంజన్ వివాహం అతని ప్రియురాలు అలీషాతో జరిగింది.
వెడ్డింగ్ విరామ సమయంలో తాజ్‌మహల్ (Taj Mahal) పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టింది రకుల్. హిప్పీ-చిక్ యెల్లో ఔట్ఫిట్ హాఫ్ శౌల్డర్ మిర్రర్ బ్లౌజ్, ఘాగ్రా, వేలాడుతున్న హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని తాజ్ మహల్ బ్యాక్ డ్రాప్లో దిగిన స్టిల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాస్తుశిల్పం కాదు కానీ చక్రవర్తుల అభిరుచి సజీవ రాతితో చెక్కబడింది..తాజ్ మహల్ నేపథ్యంలో అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. డాక్టర్ జీ, అటాక్ సినిమాలతోపాటు మరో 4 హిందీ చిత్రాలు చేస్తుండగా..ఇవన్నీ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఒక బైలింగ్యువల్, మరో తమిళ చిత్రంలో నటిస్తోంది.