Ukraine indian movies | షూటింగ్ స్పాట్‌గా ఉక్రెయిన్..అక్కడ షూట్ చేసిన భారతీయ సినిమాలివే
ఎప్పుడూ వివిధ దేశాల పర్యాటకులతో సందడిగా ఉండే ఉక్రెయిన్ పరిసర ప్రాంతాలు రష్యా యుద్దం ప్రకటించడంతో అతలాకుతలం అయ్యాయి. ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాలు షూటింగ్స్ (Ukraine Shooting locations)కు హాట్ స్పాట్‌గా నిలుస్తాయి. ఉక్రెయిన్‌కు భారతీయ సినీ పరిశ్రమ (Indian FIlm Industry)తో మంచి అనుబంధం ఉంది.
వరల్డ్ వైడ్‌గా అత్యంత సుందరమైన ప్రదేశాలున్న దేశాల్లో ఉక్రెయిన్ (Ukraine) ఒకటి. ఎప్పుడూ వివిధ దేశాల పర్యాటకులతో సందడిగా ఉండే ఉక్రెయిన్ పరిసర ప్రాంతాలు రష్యా యుద్దం ప్రకటించడంతో అతలాకుతలం అయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడంతో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా బలగాలు సరిహద్దులను దాటి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించి దాడులు చేస్తుండటంతో..ఉక్రెయిన్ ప్రజలు విలవిలలాడిపోతున్నారు.
ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాలు షూటింగ్స్ (Ukraine Shooting locations)కు హాట్ స్పాట్‌గా నిలుస్తాయి. ఉక్రెయిన్‌కు భారతీయ సినీ పరిశ్రమ (Indian FIlm Industry)తో మంచి అనుబంధం ఉంది. ఉక్రెయిన్‌లోని చారిత్రాత్మక, అందమైన ప్రదేశాల్లో షూటింగ్స్ జరుపుకున్న సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకున్న సినిమాలపై ఓ లుక్కేస్తే…
ఆర్ఆర్ఆర్

వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ (RRR). ఈ సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలతోపాటు నాటు నాటు సాంగ్‌ను ఉక్రెయిన్‌లోని ప్యాలెస్‌లో చిత్రీకరించింది రాజమౌళి టీం. ఇప్పటికే విడుదలైన పాట ఏ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు.
99 సాంగ్స్..

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సహనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 99 సాంగ్స్ (99 Songs ). ఈ సినిమా కూడా ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకుంది. ఇండియాలోనే మొదలైన ఈ మూవీ చిత్రీకరణ ఉక్రెయిన్ లాంగ్ షెడ్యూల్‌తో ముగిసింది. ఇహాన్భట్, ఎడిల్సీ వర్గాస్ ప్రధాన పాత్రల్లో నటించారు.
2.0..
తమిళ సూపర్స్ రజనీకాంత్-మెక్సికన్ బ్యూటీ అమీ జాక్సన్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 2.0 (2.0). ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు ఉక్రెయిన్‌గా షూట్ చేసింది డైరెక్టర్ శంకర్ అండ్ టీం.
దేవ్..

తమిళ నటుడు కార్తీ లీడ్ రోల్ పోషించిన చిత్రం దేవ్ (Dev). 2019లో విడుదలైంది. రజత్ రవిశంకర్ డైరెక్షన్లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా వచ్చిన ఈ చిత్రంలోని కొన్ని సీన్లను ఉక్రెయిన్‌లో షూట్ చేశారు.
విన్నర్..

2017లో వచ్చిన తెలుగు యాక్షన్ కామెడీ చిత్రం విన్నర్ (Winner). ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకున్న మొదటి ఇండియన్ చిత్రమిదేనని డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రకటించాడు. సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

