పుష్ప..ది రైజ్ అందరి అంచనాలను దాటుకుని మరీ రికార్డుల వర్షం కురిపించింది. ఇపుడు అందరి దృష్టి పుష్ప 2 (ది రూల్) (Pushpa 2) పైనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ కొనసాగుతుంది. కానీ సుకుమార్ (Sukumar) రెండోపార్టును ఎలా ముగించాలన్న దానిపై డైలామాలో ఉన్నట్టు ఇప్పటివరకు టాక్ వినిపిస్తూ వస్తోంది. పుష్పరాజ్ శేషాచలం అడవులను శాసించే డాన్‌గా ఐపీఎస్ ఆఫీసర్ షెకావత్ పాత్రలో నటించిన ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil)తో సంఘర్షణ నేపథ్యంలో రెండోపార్టు సాగనుందని టైటిల్ చెబుతోంది. ఈ ఇద్దరి మధ్య వార్ ముగియడంతో శుభం కార్డు పడుతుంది.
కానీ సుకుమార్ మాత్రం క్లైమాక్స్ (Pushpa 2 Climax) ను హ్యాపీగా ముగించాలా..? ట్రాజెడీతో ముగించాలా..? దానిపై ఓ క్లారిటీకి వచ్చాడట. ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ తో సినిమాను ముగించాలని సుకుమార్ ఫిక్స్ అయినట్టు టాక్. ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ అయితే ప్రేక్షకులు కూడా కొంత అర్థం చేసుకొనే వీలుంటుంది. కాబట్టి ట్రాజెడీగా కానీ, హ్యాపీగా కానీ ఉండొద్దని ఫిక్సయ్యాడని టాక్. పుష్ప ఫస్ట్ పార్టు క్లైమాక్స్ లో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ న్యూడ్ గా చూపించాల్సి ఉండేదని, కమర్షియల్ కోణంలో ఆలోచించి విరమించుకున్నాడని ఇప్పటికే న్యూస్ కూడా తెరపైకి వచ్చింది.
ఇక మరోవైపు మన ప్రేక్షకులు బాధాకరమైన క్లైమాక్స్ ను జీర్ణించుకోలేరు. దీంతో ఫైనల్ గా ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ అయితే సినిమాకు బాగా షూటవుతుందనుకున్న సుకుమార్.. దాన్ని రెడీ చేసే పనిలో ఉన్నాడని టాలీవుడ్ సర్కిల్ సమాచారం.