ఇంధన ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ.. ఒంటి గంట వరకు వాయిదా

న్యూఢిల్లీ: రాజ్యసభ ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా పడింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, ఆ అంశంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. విపక్షాల నిరసనలతో ఉదయం 11 గంటలకు ఓసారి వాయిదాపడ్డ సభ. ఆ తర్వాత మళ్లీ రెండవ సారి కూడా వాయిదా వేశారు. రూల్ 267 ప్రకారం సభకు నోటీసు ఇచ్చామని, ప్రశ్నోత్తరాలను పక్కనపెట్టి.. ఇంధన ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని కోరామని ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. అప్రాప్రియేషన్ బిల్లును చేపట్టే వరకు ఆగలేమని, ధరలు పెరుగుతున్నా కొద్దీ.. సామాన్యుడు బాధలు ఎక్కువవుతున్నాయని ఖర్గే అన్నారు. ఆ సమయంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ స్పందిస్తూ.. ఈ అంశంపై ఇప్పటికే చైర్మన్ క్లారిటీ ఇచ్చారని, ఆ నిర్ణయాన్ని మార్చలేమని అన్నారు. దీంతో విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను ఒంటి గంట వరకు వాయిదా వేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

