గతంలో విజయవంతమైన చిత్రాల్ని సరికొత్త హంగులతో ముస్తాబు చేసి రీరిలీజ్ చేయడం ఇప్పుడొక ట్రెండ్‌గా మారింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘బాబా’ చిత్రాన్ని కూడా అదే కోవలో విడుదల చేయబోతున్నారు. 2002లో వచ్చిన ఈ చిత్రానికి రజనీకాంత్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. సురేష్‌కృష్ణ దర్శకత్వం వహించారు. తాను విశ్వసించే ఆధ్యాత్మిక అంశాల్ని జోడించి రజనీకాంత్ ఈ కథ సిద్ధం చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. దాంతో కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేసి, వాటికి సాంకేతిక హంగుల్ని జోడించి మళ్లీ విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం రీషూట్ చేసిన సన్నివేశాలకు రజనీకాంత్ డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. రజనీకాంత్ జన్మదినమైన డిసెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.