విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రతపై అవగాహన
జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న న్యాయ సేవల వారోత్సవాల్లో భాగంగా గురువారం చుంచుపల్లి మండలం రామ్‌నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి...
చుంచుపల్లి, నవంబర్ 12 : జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న న్యాయ సేవల వారోత్సవాల్లో భాగంగా గురువారం చుంచుపల్లి మండలం రామ్‌నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించారు. సురక్షిత బాల్యం అభియాన్‌లో భాగంగా గుడ్ టచ్–బ్యాడ్ టచ్, వ్యక్తిగత భద్రత, ఆపద సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తమకు ఎదురయ్యే అసౌకర్యకరమైన పరిస్థితులను ధైర్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే ఉచిత న్యాయ సేవలు, బాలలకు కల్పించిన హక్కుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ పావని, సాహితి, పారా లీగల్ వాలంటీర్ (PLV) జానకిరామ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి సీత పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రతపై అవగాహన
Tragedy |తీర్థయాత్రలో విషాదం.. మనవడిని కాపాడబోయి అమ్మమ్మ, తాత గల్లంతు
Man Offered Bomb As Rasgulla | రసగుల్లా అని చెప్పి బాంబు ఇవ్వడంతో కొరికిన వ్యక్తి.. అది పేలడంతో మృతి
U-19 Asia Cup | అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో భారత్ ఘన విజయం.. ఫైనల్లో పాక్‌తో పోరుకు సిద్ధం..!
BRTU Won | యూనియన్ ఎన్నికల్లో బీఆర్టీయూ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

