హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ దిశనుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న తెలిపారు. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండుచోట్ల ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, వికారాబాద్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.