Thaai Kizhavi | సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించి, సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం ‘తాయ్ కిళవి’ (Thaai Kizhavi). ఈ చిత్రం తాజాగా డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.75 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 10 నుంచి ఈ చిత్రం ‘జియో హాట్‌స్టార్’ (JioHotstar)తో పాటు సింప్లీ సౌత్ అనే ఓటీటీలో ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామాను ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్ తన సొంత నిర్మాణ సంస్థ ‘శివకార్తికేయన్ ప్రొడక్షన్స్’ పతాకంపై నిర్మించారు. 63 ఏళ్ల వయసులో రాధిక దాదాపు 5 గంటల పాటు ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని మరీ పవునుత్తాయి అనే వృద్ధురాలి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు.
ఈ సినిమా కథవిషయానికి వస్తే.. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో పవునుత్తాయి (రాధికా శరత్‌కుమార్) ఒక కఠినమైన వడ్డీ వ్యాపారి. అయితే ఊహించని విధంగా ఆమె పక్షవాతానికి గురై మంచాన పడుతుంది. ఆమె వద్ద 160 తులాల బంగారం ఉందనే వార్త తెలుసుకున్న ఆమె ముగ్గురు కొడుకులు వేర్వేరు ప్రాంతాల నుంచి హుటాహుటిన ఊరికి చేరుకుంటారు. ఆ బంగారాన్ని దక్కించుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలు, వాటి వల్ల వచ్చే కామెడీ మరియు ఎమోషన్స్‌తో ఈ సినిమా సాగుతుంది.
📢 Official Announcement 💥
Recent Mega Blockbuster Movie 🤩#ThaaiKizhavi (Tamil)
Streaming from April 10 on JioHotstar in Tamil, Telugu, Kannada, Malayalam, Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/cho9QpKeTi
— OTT Trackers (@OTT_Trackers) March 30, 2026