ముషీరాబాద్, సెప్టెంబర్ 23 : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు పాత విధానంలోనే పథకాన్ని కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బుధవారం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యానగర్‌లో విద్యార్థులు నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.