R Ashwin | కపిల్ దేవ్ రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్.. మూడో బౌలర్‌గా ఘనత
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు. 688 వికెట్లతో కపిల్ దేవ్ (687 వికెట్లు)ను వెనక్కి నెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు.
R Ashwin : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఆఫ్ స్పిన్నర్ 688 వికెట్లతో కపిల్ దేవ్ (687 వికెట్లు)ను వెనక్కి నెట్టాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీని ఔట్ చేసి అతను ఈ రికార్డుకు చేరువయ్యాడు.
దాంతో, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఇండియా తరఫున అతనికి ఇది 269వ మ్యాచ్ అంతే. తక్కువ మ్యాచుల్లోనే అతను ఇన్ని వికెట్లు తీయడం విశేషం.
భారత వికెట్ల వీరులు వీళ్లే..
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు నెలకొల్పాడు. ఈ లెగ్‌స్పిన్నర్ 953 వికెట్లు తీశాడు. మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 707 వికెట్లతో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. అశ్విన్ 688 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
1. అనిల్ కుంబ్లే – 953
2. హర్భజన్ సింగ్ – 707
3. రవిచంద్రన్ అశ్విన్ – 688
4. కపిల్ దేవ్ – 687
5. జహీర్ ఖాన్ – 597
వరల్డ్ నంబర్ 1 బౌలర్
ఫామ్‌లో ఉన్న అశ్విన్ (864 పాయింట్లు) వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో చెలరేగుతున్న అతను మొదటి ర్యాంకులో ఉన్న జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్)ను వెనక్కి నెట్టాడు. స్వదేశంలో జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో ఇప్పటివరకు అశ్విన్ 16 వికెట్లు పడగొట్టాడు.
చెన్నైకి చెందిన అశ్విన్ 2010లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. శ్రీలంకపై తొలి మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకూ 91 టెస్టులు ఆడిన ఈ ఆఫ్ స్పిన్నర్ 466 వికెట్లు తీశాడు. 113 వన్డేల్లో 151 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ విన్నర్‌గా పేరొందిన అశ్విన్ ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ఆడిన అతను ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
IND vs AUS | వంద వికెట్ల క్లబ్లో ఉమేశ్.. మురళీని దాటేసిన లయాన్.. రెండో రోజు హైలైట్స్ ఇవే..
IND vs AUS | రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకు టీమిండియా ఆలౌట్.. ఫిఫ్టీతో ఆదుకున్న పూజారా
RCB | డబ్ల్యూపీఎల్ జెర్సీ విడుదల చేసిన ఆర్సీబీ.. ఫొటోలు వైరల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

