NEET | నీట్ నిర్వహణలో అడుగడుగునా డొల్లతనం.. పరీక్ష కేంద్రాల్లో కనిపించని సీసీ కెమెరాలు
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదంగా మారిన నీట్ పరీక్ష నిర్వహణలో అడుగడుగునా డొల్లతనం బయటపడింది. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించని విషయం థర్డ్ పార్టీ జరిపిన పరిశీలనలో స్పష్టంగా వెల్లడైంది.
- రక్షణ లేని స్ట్రాంగ్ రూముల్లో ప్రశ్నా పత్రాలు
- కేటాయించిన సిబ్బందికి బదులు వేరేవారు
- థర్డ్ పార్టీ పరిశీలనలో బయటపడ్డ నిర్లక్ష్యం
NEET | న్యూఢిల్లీ, జూన్ 21: పేపర్ లీక్ ఆరోపణలతో వివాదంగా మారిన నీట్ పరీక్ష నిర్వహణలో అడుగడుగునా డొల్లతనం బయటపడింది. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించని విషయం థర్డ్ పార్టీ జరిపిన పరిశీలనలో స్పష్టంగా వెల్లడైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించే బాధ్యతను ఒక థర్డ్ పార్టీ సంస్థకు జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ) అప్పగించింది. దాదాపు నాలుగు వేల కేంద్రాల్లో మే 5న నీట్ పరీక్ష జరగగా 399 కేంద్రాలను థర్డ్ పార్టీ పరిశీలకులు సందర్శించి పరీక్షల నిబంధనలు అమలవుతున్న తీరును తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను జూన్ 16న ఎన్టీఏకు థర్డ్ పార్టీ సంస్థ అందించింది. పరీక్షా కేంద్రాల్లో లోపాలు, నిర్లక్ష్యాన్ని ఈ నివేదిక స్పష్టంగా పేర్కొన్నది.
నిబంధనలు బేఖాతరు
నిబంధనల ప్రకారం పరీక్ష జరిగే గదిలో రెండు సీసీ కెమెరాలు ఉండాలి. ఇందుకు సంబంధించిన లైవ్ ఫీడ్ నేరుగా ఢిల్లీలోని ఎన్టీఏ కేంద్ర కార్యాలయంలోని సెంట్రల్ కంట్రోల్ రూమ్‌కు వెళ్లాలి. అక్కడ నిపుణుల బృందం ఈ లైవ్ ఫీడ్‌ను పర్యవేక్షించాలి. కానీ, 399 పరీక్షా కేంద్రాలను పరిశీలిస్తే 186 కేంద్రాలు, అంటే 46 శాతం వాటిల్లో సీసీకెమెరాలు లేవని థర్డ్ పార్టీ గుర్తించింది. ప్రశ్నాపత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లకు అభ్యర్థులకు పంపిణీ చేసే వరకు సెక్యూరిటీ గార్డు ఉండాలి. కానీ, 68 కేంద్రాల్లో(16 శాతం) స్ట్రాంగ్ రూమ్‌లకు సెక్యూరిటీ గార్డు లేరని తేలింది. 83 కేంద్రాల్లో విధులకు రావాల్సిన సిబ్బంది, హాజరైన సిబ్బంది వేర్వేరుగా ఉన్నారని థర్డ్ పార్టీ పరిశీలనలో వెల్లడైంది. ఈ నివేదిక ఆధారంగా ఎన్టీఏ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.
ప్రధాన్‌కు చేదు అనుభవం
నీట్-యూజీ, యూజీసీ-నెట్ పరీక్షల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆందోళనలు చేపట్టింది. యోగా కార్యక్రమం జరగాల్సిన ఉన్న నార్త్ క్యాంపస్‌లో నల్లజెండాలు ప్రదర్శించింది. దీంతో తన కార్యక్రమాన్ని ప్రధాన్ రద్దు చేసుకున్నారు. వేరే ముఖ్యమైన పని వల్ల ప్రధాన్ హాజరుకాలేదని యూనివర్సిటీ అధికారులు ప్రకటించగా, నిరసనలకు భయపడి రాలేదని ఏఐఎస్ఏ నేతలు పేర్కొన్నారు.
నీట్ కౌన్సెలింగ్ వాయిదాకు ‘నో’: సుప్రీంకోర్టు
వివాదాల్లో చిక్కుకున్న నీట్-యూజీ 2024 కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. జూలై 6 నుంచి జరగనున్న కౌన్సెలింగ్‌ను రెండు రోజులు నిలిపివేయాలని పిటిషన్‌దారులు కోరగా వెకేషన్ బెంచ్ శుక్రవారం తిరస్కరించింది. కౌన్సెలింగ్ అనేది తెరిచి, మూసేసే ప్రక్రియ కాదని వ్యాఖ్యానించింది. అయితే, తాను కౌన్సెలింగ్‌పై స్టే విధించమని అడగడం లేదని, నీట్లో అక్రమాలకు సంబంధించిన పిటిషన్లు జూలై 8న సుప్రీంకోర్టు సాధారణ ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నందున జూలై 6 నుంచి జూలై 8 వరకు మాత్రమే కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా ఆపాలని పిటిషన్‌దారుల తరపున న్యాయవాది కోర్టును కోరారు. ఇందుకు ధర్మాసనం తిరస్కరించింది. జూలై 6 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై స్పందనను తెలియజేయాల్సిందిగా ఎన్టీఏ, కేంద్రానికి రెండు వారాల గడువు ఇచ్చింది. జూన్ 23న 1,563 మందికి మరోసారి జరగనున్న పరీక్షకు సంబంధించి ఎన్టీఏ కొంత సమాచారాన్ని దాచిపెట్టిందని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా స్పందనను తెలియజేయాల్సిందిగా ఎన్టీఏను కోర్టు ఆదేశించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

