Indian Origins | ప్రపంచ రాజకీయాల్లో భారతీయ నారీశక్తి
ప్రపంచ రాజకీయ యవనికపై నేడు భారతీయ మూలాలు కలిగిన మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు భారత్‌లో చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్న మహిళలు విదేశీ రాజకీయాల్లో మాత్రం సత్తా చాటి తమను తాము నిరూపించుకుంటున్నారు.
- యూకే, అమెరికా, న్యూజిలాండ్, కెనడా వంటి దేశాల్లో చట్టసభలకు ఎన్నిక
- అమెరికా రాజకీయాల్లో కీలకంగా మారిన కమలా హారిస్, ఉషా చిలుకూరి
- యూకే పార్లమెంటులో 15 మంది
- బ్రిటన్ ప్రతిపక్ష నేతగా ప్రీతి పటేల్?
Indian Origins | హైదరాబాద్, జూలై 17: ప్రపంచ రాజకీయ యవనికపై నేడు భారతీయ మూలాలు కలిగిన మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు భారత్‌లో చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్న మహిళలు విదేశీ రాజకీయాల్లో మాత్రం సత్తా చాటి తమను తాము నిరూపించుకుంటున్నారు. అమెరికా, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఇలా అనేక దేశాల్లో భారతీయ మూలాలు కలిగిన మహిళలు ప్రజల మన్ననలు పొంది చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. అమెరికాలో జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ మూలాలు కలిగిన ఇద్దరు మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. మరోవైపు బ్రిటన్‌లో ప్రతిపక్ష నాయకురాలిగానూ ఓ బ్రిటీష్ ఇండియన్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇలా వివిధ దేశాల్లో వేర్వేరు వృత్తులతో పాటు రాజకీయాల్లోనూ భారతీయ మూలాలు కలిగిన స్త్రీలు తమదైన ముద్ర వేస్తున్నారు.
బ్రిటన్ పార్లమెంటులో 15 మంది భారతీయ మహిళలు
ఒకనాడు భారత్‌ను పాలించిన బ్రిటన్ రాజకీయాల్లో నేడు భారతీయ మూలాలు ఉన్న మహిళలు కీలకంగా మారారు. ఇటీవల జరిగిన యూకే సాధారణ ఎన్నికల్లో 26 మంది బ్రిటీష్ ఇండియన్లు పార్లమెంటుకు ఎన్నికవగా వీరిలో 15 మంది మహిళలే కావడం విశేషం. గతంలో బ్రిటన్ హోం సెక్రటరీగా పని చేసిన ప్రీతి పటేల్ ఈసారి ప్రతిపక్ష నేత అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రీతి పటేల్ పూర్వీకులు గుజరాత్ నుంచి వలస వెళ్లారు. ఇక, 29 ఏండ్లకే యూకే పార్లమెంటులో అడుగుపెట్టిన శివానీ రాజా సంచలనం సృష్టించారు. ఆమె తల్లిదండ్రులు కూడా గుజరాత్‌కు చెందిన వారు. ఆమె భగవద్గీత మీద ప్రమాణం చేయడం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇక, లేబర్ పార్టీ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన నదియా విట్టోమ్ కూడా బ్రిటన్ రాజకీయాల్లో కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లో ఆమె 23 ఏండ్ల వయస్సులోనే మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికై అతి పిన్న వయస్కురాలైన ఎంపీగా చరిత్రకెక్కారు. నదియా తండ్రి పంజాబీ కాగా, తల్లి ఆంగ్లో-ఇండియన్.
కెనడాలో మహిళా మంత్రులుగా..
కెనడా రాజకీయాల్లోనూ భారతీయ మూలాలు కలిగిన మహిళా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2021లో జరిగిన కెనడా పార్లమెంటు ఎన్నికల్లో 17 మంది భారత మూలాలు ఉన్న వారు గెలవగా, వీరిలో ఆరుగురు మహిళలే. వీరిలో అనిత ఇందిరా ఆనంద్ కెనడా ట్రెజరీ బోర్డుకు అధ్యక్షురాలిగా కీలక పదవిని నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె మంత్రిగానూ పని చేశారు. మరో ఎంపీ కమల్ ఖేరా ప్రస్తుతం కెనడా మంత్రిగా ఉన్నారు. ఆమె పూర్వీకులు ఢిల్లీకి చెందిన వారు. మరో మహిళా ఎంపీ బర్దీశ్ ఛగ్గర్ కూడా మంత్రిగా పని చేశారు.
ఇతర దేశాల్లోనూ..
అమెరికా, కెనడా, యూకే మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ భారతీయ మహిళలు రాజకీయంగా రాణిస్తున్నారు. న్యూజిలాండ్‌లో ప్రియాంక రాధాకృష్ణన్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2020 నుంచి 2023 వరకు ఆమె మంత్రిగానూ పని చేశారు. ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాల్లోనూ భారతీయ మూలాలు కలిగిన మహిళలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అమెరికాలో హారిస్, ఉషా వాన్స్
అమెరికా ఎన్నికల్లో ఇద్దరు భారతీయ మూలాలు కలిగిన మహిళలు కీలకంగా మారారు. డెమొక్రటిక్ పార్టీ తరపున మరోసారి ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీ పడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున ఈ పదవికి తెలుగు దంపతుల కూతురు ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్ పోటీ చేస్తున్నారు. తన భర్త గెలుపు కోసం ఉషా తనవంతు సహకారం అందిస్తున్నారు. కాగా, కమలా హారిస్ ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి మహిళగా, మొదటి బ్లాక్ అమెరికన్‌గా, మొదటి దక్షిణాసియా వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మరోవైపు అమెరికా రాజకీయాల్లో నిక్కీ హేలీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు పంజాబ్ నుంచి వలసవెళ్లారు. ఆమె రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడి ఓడిపోయారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

