Prabhas | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చేస్తున్న ప్రభాస్ ఈ చిత్రం అనంతరం సలార్ 2ను పట్టాలెక్కించనున్నాడు. అయితే ప్రభాస్‌కు సంబంధించి ఒక సాలిడ్ నెట్టింట వైరల్‌గా మారింది. లండన్‌లో విలాసవంతమైన ఓ భవనంను ప్రభాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఇంటిని ప్రభాస్ భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా సినిమా షూటింగ్ కానీ.. వెకేషన్స్ కోసం కానీ వెళ్లినప్పుడు ప్రభాస్ ఇంతకుముందు అదే ఇంట్లో ఉండేవాడు అని.. ఇక ఆ ఇల్లు బాగా నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ప్రభాస్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కల్కి సినిమా చేస్తుండగా… నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.