నల్లగొండలోని వైటీపీఎస్‌లో యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, ఉద్యోగులు భద్రాద్రి, పాల్వంచలో బుధవారం నిరసన తెలిపారు.