పవన్, మౌనిక, సిరి ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ ‘పోతిరెడ్డిపల్లి’. అశోక్ రొయ్య దర్శకత్వంలో జేరమ్ విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు బాబూమోహన్ క్లాప్ కొట్టగా, ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.
మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, రాజ్యసభ సభ్యుడు, ఆర్.కృష్ణయ్య, దర్శకుడు వి.సముద్ర, ఓయూ శంకర్ గుండేటి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఆసక్తికరమైన హారర్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నదని హీరో పవన్ తెలిపారు. ఇరుముడి సాయిస్వరూప్, సునీత మనోహర్, ఆనంద్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: ర్యాప్ రాక్ షకీల్, సమర్పణ: త్రిపుర మీడియా, ఆరాధ్య క్రియేషన్స్.