మునిపల్లి : సంగారెడ్డి ( Sangareddy ) జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామ సమీపంలో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు (Ganja Seize) . గ్రామ శివారులోని ముంబై జాతీయ రహదారిపై డక్కన్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలో కిలో 250 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని మునిపల్లి ఏఎస్సై బక్కన్న తెలిపారు.
జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు ఇద్దరు వ్యక్తులు ఎండు గంజాయిని తీసుకువస్తున్నట్లు సమాచారం మేరకు కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి, మునిపల్లి ఏఎస్సై, పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. రాయికోడ్ మండలం వడ్డె నర్సింలు, కొండాపూర్ మండలానికి చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తులు కర్ణాటక రాష్టం బీదర్ ప్రాంతంలో తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు ఏఎస్సై తెలిపారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, గంజాయిని, కారును, బైక్ను నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.