ఎర్రకోట హింస కేసులో మరో ఇద్దరు అరెస్ట్

న్యూఢిల్లీ: ఎర్రకోట హింస కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అందులో ఒకరు జనవరి 26న ఎర్రకోట వద్ద విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన ఖేమ్‌ప్రీత్ సింగ్ కాగా, మరొకరు జనవరి 26 నాటి ఘటనతోపాటు అంతకుముందు కూడా నేర చరిత్ర కలిగిన మణిందర్‌జిత్ సింగ్. ఖేమ్ ప్రీత్ సింగ్ పంజాబీ కాగా, మణిందర్‌జిత్ సింగ్ డచ్చి జాతీయుడు. ప్రస్తుతం బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో స్థిరపడ్డ మణిందర్‌జిత్ సింగ్ నకిలీపత్రాలతో దేశం దాటిపోయేందుకు ప్రయత్నించి ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులకు పట్టుబడ్డాడు.
కాగా, గత జనవరి 26న రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద హింస చెలరేగినప్పటి నుంచి పోలీసులు ఢిల్లీ, పంజాబ్‌లో నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించి వారి జాడ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వీరితో ఎర్రకోటపై హింస కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 14కు చేరింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Graduate MLC Elections | సంపాదన మంత్రులది.. బాధ్యత మాకా?.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు
Revanth Reddy | రేవంత్‌ను విష్ చేయని పెద్దలు.. పుట్టినరోజున పలుకరించని ఢిల్లీ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ
Pawan Kalyan Divorce | 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్నామని పవన్ కల్యాణ్, అన్నా సంయుక్త ప్రకటన
Horoscope | 10-11-2026 మంగళవారం.. మీ రాశి ఫలాలు
ప్రతి సెంటర్‌కూ అబ్జర్వర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

