Accident : ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన కానిస్టేబుల్ మృతి చెందాడు. గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఐరన్ రెయిలింగ్‌ను కారు ఢీకొని పల్టీ కొట్టిన ఘటనలో జస్వంత్(36) అనే కానిస్టేబుల్ మరణించాడు. కుటుంబంతో కలిసి కారులో అన్నవరం వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జస్వంత్ కుటుంబంతో కలిసి ఏపీలోని అన్నవరం వెళ్లాడు. దర్శనం అయ్యాక తిరిగి హైదరాబాద్ వస్తుండా ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఐరన్ రెయిలింగ్‌ను వీరు కారు ఢీకొట్టి.. పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో జస్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్య, కూతురు, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు.