టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu), మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్లో వచ్చిన చిత్రం పోకిరి (Pokiri). తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ సినిమాను మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులు పోకిరి (4K UHD) వెర్షన్ ను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టికెట్స్ అన్నీ అమ్ముడుపోయినట్టు ఓ వార్త బయటకు రాగా..తాజాగా మరో అప్డేట్ వచ్చింది.
లేటెస్ట్ న్యూస్ ప్రకారం హైదరాబాద్, కాకినాడ లాంటి మేజర్ కేంద్రాల్లో ఈ స్పెషల్ షోస్‌కు హౌజ్ ఫుల్ అయ్యారట. యూఎస్ఏ స్పెషల్ షోలో కూడా ఇదే పరిస్థితి ఉందని తాజాగా ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇప్పటికే వచ్చిన అప్డేట్ ప్రకారం అభిమానులు ఆగస్టు 9న కాలిఫోర్నియాలో పోకిరి స్పెషల్ షో ప్లాన్ చేశారు.
పోకిరి చిత్రంలో ఇలియానా హీరోయిన్గా నటించగా..నాజర్, సుధ, ప్రదీప్ రావత్, అలీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, ప్రకాశ్‌రాజ్ కీ రోల్స్ పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. పోకిరి దాదాపు విడుదలైన అన్ని సెంటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించి..నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.