నేటి నుంచి జీ-7 శిఖరాగ్ర సమావేశాలు..
నేటి నుంచి జీ-7 శిఖరాగ్ర సమావేశాలు.. | నేటి నుంచి బ్రిటన్‌లో జీ-7 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా సభ్య దేశాలుగా ఉన్న కూటమి సమావేశాలు శుక్రవారం ప్రారంభంకానున్నాయి.

న్యూఢిల్లీ : నేటి నుంచి బ్రిటన్‌లో జీ-7 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా సభ్య దేశాలుగా ఉన్న కూటమి సమావేశాలు శుక్రవారం ప్రారంభంకానున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాలను అతిథ్య దేశమైన బ్రిటన్ ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రధాని ఇప్పటికే బ్రిటన్‌కు వెళ్లడం లేదని ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. శని, ఆదివారాల్లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.
ఈ ఏడాది జీ7 సమ్మిట్ ‘బిల్డ్ బ్యాక్ బెటర్ (తిరిగి గొప్పగా నిర్మించుకుందాం)’ థీమ్‌తో జరుగనుంది. కరోనా నుంచి ప్రపంచం మొత్తం బయటపడడమే కాకుండా భవిష్యత్తులో దాడి చేయబోయే మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండడం అందులో మొదటిది కాగా.. భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడం రెండోది. అలాగే వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కొంటూ భూమిపై ఉన్న జీవవైవిధ్యాన్ని కాపాడడం మూడోది కాగా.. భాగస్వామ్య విలువలను రక్షించుకుంటూ స్వేచ్ఛాయుత సమాజాన్ని నెలకొల్పడం నాలుగో నినాదంగా బ్రిటన్ పేర్కొంది.
అలాగే ఈ సమావేశంలో పాల్గొనే దేశాలన్నీ ప్రపంచంలో నెలకొన్న కరోనా సమస్యలు, వాతావరణ మార్పులపై చర్చించి.. తమ ఆలోచనలను పంచుకోనున్నాయి. జీ-7 సమావేశాల్లో పాల్గొనడం రెండోసారి కాగా.. 2019లో జరిగిన సమావేశాలకు ఫ్రాన్స్, భారత్‌ను ఆహ్వానించింది. ఆ సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ.. వాతావరణ మార్పులు, సముద్రాల్లోని జీవవైవిధ్యం, సాంకేతిక పరివర్తన అంశాలపై ప్రసంగించారు.
ఇవి కూడా చదవండి..
‘కొవిషీల్డ్’ గ్యాప్ తగ్గింపు!
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

