వైద్య సిబ్బందికి వందనం : ప్రధాని మోదీ
వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి : ప్రధాని | కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ఆయన బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఏటా నిర్వహిస్తున్న ప్రపంచ ‘వెసాక్’ వేడుకల్లో కీలకోపన్యాసం చేశారు.

న్యూఢిల్లీ : కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ఆయన బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఏటా నిర్వహిస్తున్న ప్రపంచ ‘వెసాక్’ వేడుకల్లో కీలకోపన్యాసం చేశారు. బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడి పుట్టిన రోజు సందర్భంగా బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. దీన్ని ‘ట్రిపుల్-బ్లెస్డ్ డే’గానూ పరిగణిస్తారు. ఈ క్రమంలో అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యతో కలిసి కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి నిత్యం నిస్వార్థంగా సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్, వైద్యులు, నర్సులకు వందనం చేస్తున్నానన్నారు.
అలాగే ఆత్మీయులను పోగొట్టుకున్న వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ప్రస్తుతం ఇప్పుడు మహమ్మారిపై అవగాహన ఉందని, ఇది పోరాడేందుకు అవసరమైన వ్యూహాన్ని బలపరుస్తుందన్నారు. ప్రాణాలు కాపాడేందుకు, మహమ్మారిని ఓడించేందుకు ముఖ్యమైన టీకా మన వద్ద ఉందని, వ్యాక్సిన్లపై పని చేసిన శాస్త్రవేత్తలను చూసి దేశం గర్వపడుతుందన్నారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబీసీ) సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 50 మంది ప్రముఖ బౌద్ధ మత నాయకులు పాల్గొన్నారు. అలాగే సాంస్కృతిక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజీజు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
కరోనాను జయించిన 72 ఏండ్ల వృద్ధురాలు
‘యాస్ ఎఫెక్ట్’.. కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేత
కరోనాకు 513 మంది వైద్యుల బలి
మరికొద్ది గంటల్లో తీరం దాటనున్న ‘యాస్’
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

