ఎనిమిది నెలలుగా వేతనాల్లేవ్!
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ పాఠశాలలు, మాడల్స్కూళ్లు, కస్తూర్బా పాఠశాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో 1,400 మంది ఔట్సోర్సింగ్ టీచర్లు పనిచేస్తున్నారు. వీరికి స్థాయిని బట్టి రూ. 13,600 నుంచి రూ.21 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు.
-
మాడల్‌స్కూల్ ఔట్సోర్సింగ్ అరిగోస
-
ఆందోళనకు సిద్ధమవుతున్న సిబ్బంది
-
దీపావళి తర్వాత కార్యాచరణ ప్రకటన
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ పాఠశాలలు, మాడల్స్కూళ్లు, కస్తూర్బా పాఠశాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో 1,400 మంది ఔట్సోర్సింగ్ టీచర్లు పనిచేస్తున్నారు. వీరికి స్థాయిని బట్టి రూ. 13,600 నుంచి రూ.21 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వీరికి ప్రతినెలా వేతనాలు ఇచ్చేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా మైండ్ లీవర్స్, యువశక్తి, లక్ష్య్, లేబర్‌నెట్, ఎంఅండ్జే, వాల్యుయేర్ తదితర 18 ఏజెన్సీల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. ఒకటి రెండు మినహా మిగిలిన ఏజెన్సీలు సకాలంలో వేతనాలు ఇవ్వడంలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. చాలా ఏజెన్సీలు ఎనిమిది నెలలుగా వేతనాలు పెండింగ్‌లో పెట్టడంతో ఆర్థికంగా సతమతమవుతున్నారు.
ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. 8 నెలలుగా వేతనాలు అందకపోవడంతో విసిగిపోయిన సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు గత్యంతరంలేని పరిస్థితుల్లో సర్కార్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్ మొదటి వారంలో మండల, జిల్లాస్థాయి అధికారులకు విన్నవిస్తామని పేర్కొంటున్నారు. దీపావళి పండుగ వరకు వేచిచూస్తామని, తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టంచేస్తున్నారు. అవసరమైతే హైదరాబాద్ వేదికగా భారీ నిరసన కార్యక్రమం చేపడుతామని హెచ్చరిస్తున్నారు.
పట్టాలెక్కని ప్రత్యేక కార్పొరేషన్ హామీ
అధికారంలోకి రాగానే ఏజెన్సీలను రద్దుచేసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలోని 5 లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేండ్లవుతున్నా ఈ హామీకి అతీగతీలేకుండా పోయింది. ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదని ఔట్సోర్సింగ్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయకున్నా ప్రతినెలా సక్రమంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించి వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వానికి బుద్ధిచెప్తామని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

