పల్లెలే ఆదుకొన్నయ్!

- కరోనాలోనూ కావాల్సినంత ఉపాధి
- పుష్కలంగా వ్యవసాయ పనులు
- తెలంగాణలో కలిసొచ్చిన కాలం
- దీనికితోడు సాగునీటి ప్రాజెక్టులు
- పట్టణాల్లో పెరిగిన నిరుద్యోగం
- సీఎంఈఐ సర్వే వెల్లడి
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చి వేలాది ఉద్యోగాలను లాగేసింది. లక్షల మంది ఉపాధిని కొల్లగొట్టింది. అయితే, పల్లెలే మనకు రక్షణగా నిలిచాయి. 2021లో నిరుద్యోగం, ఉపాధి లేమితో పట్టణాలు బిక్కుబిక్కుమంటే, పల్లెల్లో కావాల్సినంత పని దొరికింది. కొవిడ్ రెండో వేవ్ తర్వాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి రంగంపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) సర్వే నిర్వహించగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2021లో అక్టోబర్ మినహా మిగిలిన 11 నెలల్లో గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో నిరుద్యోగం అధికంగా నమోదైంది. పట్టణాల్లో ఆసక్తి, నైపుణ్యాలు ఉన్నా పని దొరకలేదు. గ్రామాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. వానలు బాగా పడి కాలం కావడంతో వ్యవసాయ పనులు పుష్కలంగా లభించాయి. దీనికితోడు ఉపాధిహామీ పథకం, ప్రభుత్వాలు చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లభించాయి.
రాష్ట్రంలో మెరుగైన ఉపాధి అవకాశాలు
కరోనా రెండో వేవ్ తర్వాత తెలంగాణ 2.2 శాతంతో అతితక్కువ నిరుద్యోగం ఉన్న ఐదు రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. విస్తారంగా వర్షాలు పడడమే కాకుండా ప్రభుత్వం నిర్మించిన నీటి పారుదల ప్రాజక్టులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగటం దీనికి ప్రధాన కారణం. స్వయం ఉపాధికి తగిన ప్రోత్సాహం అందించటం కూడా పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదపడింది. అయితే, హర్యానా, రాజస్థాన్‌లో నిరుద్యోగం భారీగా పెరిగింది. ఇక, గత ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా నిరుద్యోగం రికార్డుస్థాయిలో 11.84 శాతానికి చేరుకొన్నది. డిసెంబర్లో 7.91 శాతానికి చేరింది. ఆ నెలలో దాదాపు 85 లక్షల మంది పనుల కోసం పట్టణాలకు వలస వెళ్లగా 40 లక్షల మందికే పని దొరికింది. ఎక్కువగా అసంఘటిత రంగంపై కరోనా ప్రభావం చూపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

