తిరుమల : వేయి నామాలు గల వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతుండగా స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
శిలాతోరణం ( Sarvadarshanam ) వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 90,842 మంది భక్తులు దర్శించుకోగా 39,852 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న మొక్కుల ద్వారా హుండీకి రూ. 4.66 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. 4.33 లక్షల లడ్డూలను విక్రయించగా 2.98 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని తెలిపారు.