‘త్రూ ద ఐస్’.. కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్న అమ్మ.. బొమ్మల ప్రదర్శన!
‘ఒక సామాజిక సమస్యపై అవగాహన పెంచడాన్ని మించిన ప్రయోజనం ఏ కళకైనా ఏం ఉంటుంది? కళాకారుడికి అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది?’ అంటున్నారు ఫొటోగ్రాఫర్ ఆండీ మల్హన్.
ఢిల్లీలో ‘త్రూ ద ఐస్’ పేరుతో ఇటీవల ఫొటోగ్రాఫర్ ఆండీ మల్హన్ తన మాతృమూర్తి ఫొటోలతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నది. ‘మా అమ్మ పేరు ఉష. డెమెన్షియా బాధితురాలు. ఈ రుగ్మత మా అమ్మకే పరిమితం కాలేదు. మా కుటుంబ సమస్య కూడా కాదు.
జనమంతా తెలుసుకోవాల్సిన అంశాలెన్నో ఇందులో ఇమిడి ఉన్నాయి’ అంటారాయన. ప్రజల్లో డెమెన్షియా పట్ల అవగాహన పెంచడానికి తన తల్లినే ఉదాహరణగా ఎంచుకున్నారు మల్హన్. ఆ మతిమరుపు వ్యాధి కారణంగా ఆమె జీవితంలో వచ్చిన మార్పులను తన కెమెరాలో బంధించారు. వాటినే ఇప్పుడు ప్రదర్శనకు ఉంచారు. డెమెన్షియా జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధి. రోగి క్రమంగా ఆలోచనాశక్తిని కోల్పోతారు. పాత విషయాలేవీ గుర్తుండవు. దేశంలో 40 లక్షల మంది డెమెన్షియా బాధితులున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

