ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. మంగళవారం చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్ లీటర్‌కు 28 పైసల వరకు పెంచాయి.

న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. మంగళవారం చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్ లీటర్‌కు 28 పైసల వరకు పెంచాయి. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి పెరిగాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.50, డీజిల్ రూ.88.23కి పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్ రూ.103.63కు చేరింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను ధాటింది.
దేశంలో అత్యధికంగా పాక్‌కు సమీపంలో ఉన్న రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో ఫిబ్రవరిలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. ఈ నెల ప్రారంభంలో డీజిల్ సైతం రూ.100 మార్క్‌ను చేరింది. దేశంలోనే అత్యధికంగా ప్రస్తుతం రూ.108.37, డీజిల్ రూ.101.12కు పెరిగింది. ఇప్పటి వరకు మే 4 తర్వాత నుంచి ఇప్పటి వరకు 29సార్లు ధరలు పెరిగాయి. వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు.
దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్ ధరలు
ఢిల్లీలో పెట్రోల్ రూ.97.50.. డీజిల్ రూ.88.23
ముంబైలో పెట్రోల్ రూ.103.63.. డీజిల్ రూ.95.72
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.101.33.. డీజిల్ రూ.96.17
కోల్‌కతాలో పెట్రోల్ రూ.97.38, డీజిల్ రూ.91.08
చెన్నైలో పెట్రోల్ రూ.98.65, డీజిల్ రూ.92.83
విజయవాడలో పెట్రోల్ రూ.103.27, డీజిల్ రూ.97.53
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

