న్యూయార్క్ : అమెరికాకు చెందిన పెంటగాన్ గత పదేండ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద రహస్య సైన్యాన్ని సృష్టించింది. ఈ వాదనను అమెరికాకు చెందిన న్యూస్‌వీక్ పత్రిక తన కథనంలో మద్దతు తెలిపింది. అయితే, అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ ప్రచారాన్ని తిరస్కరించింది.
‘ఇన్సైడ్ ది మిలిటరీ సీక్రెట్ అండర్‌కవర్ ఆర్మీ’ పేరుతో యూఎస్ మ్యాగజైన్లో ఈ ప్రత్యేక నివేదికను ప్రచురించారు. రెండేండ్ల దర్యాప్తు తర్వాత ఈ ఇంటెలిజెన్స్ ఆర్మీలో దాదాపు 60 వేల మంది పనిచేస్తున్నట్లు తేలిందని తమ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. వారిలో చాలామంది నకిలీ గుర్తింపులను కూడా కలిగి ఉన్నారని, ఇంకొందరు తక్కువ ప్రొఫైల్స్‌లో నివసిస్తున్నారని వెల్లడించింది. దాని కార్యక్రమాలన్నీ విస్తృతంగా ‘సిగ్నేచర్ రిడక్షన్’ గా సూచిస్తారని తన కథనంలో తెలిపింది.
ప్రత్యేక సైనిక చర్యలతో పాటు మిలటరీ ఇంటెలిజెన్స్ నిపుణులను కూడా ఈ రహస్య సైన్యంలో చేర్చినట్లు తెలుస్తున్నది. అయితే, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన ప్రక్రియ అని నిపుణులు వాదిస్తున్నారు. ఇది సైనిక విధానాలు, సాంస్కృతిక గుర్తింపుపై కూడా ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు. ఈ విషయంపై యూఎస్ కాంగ్రెస్ ఎప్పుడూ చర్చించలేదని సమాచారం.
తప్పుడు అఫిడవిట్లు : జైలుశిక్ష పెంచాలని సీఈసీ లేఖ
మళ్లీ ఉద్రిక్తత : తూర్పు లడఖ్‌లో 22 చైనా యుద్ధ విమానాల విన్యాసాలు
ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వస్తుంటాయి..
బాబోయ్ ఎండలు : దుబాయ్‌లో మండుతున్న సూరీడు
మరింత శక్తి : వచ్చే నెలలో భారత్‌కు అమెరికా సీహాక్ హెలీకాప్టర్స్
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
రిత్రలో ఈరోజు.. ఆలిండియా రేడియోగా నామకరణం
కొత్త సేవలు : స్పీడ్ పోస్ట్‌లో అస్తికల నిమజ్జనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..