Peddi First Single | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. వృద్ధి సినిమాస్ నిర్మిస్తుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ (Chikiri Meaning) పాటకు సంబంధించిన అప్డేట్ను పంచుకుంది టీమ్. ఏఆర్ రెహమాన్‌తో కలిసి ఈ ‘చికిరి’ పదానికి అసలు అర్థం ఎంటో చెప్పాడు బుచ్చిబాబు. ఈ సందర్భంగా ప్రోమోను పంచుకున్నారు. ఈ పాట ఫుల్ లిరికల్ నవంబర్ 07న విడుదల కాబోతుంది.