బెంగళూరు: ప్రొ కబడ్డీ ప్రీమియర్ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో అత్యంత పేలవ ప్రదర్శనతో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశపరిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు జట్టు 35-54తో జైపూర్ చేతిలో చిత్తుగా ఓడి 16వ ఓటమిని నమోదు చేసుకుంది. టైటాన్స్ తరఫున పాలమూరు ఆటగాడు గల్ల రాజు (9 పాయింట్లు) భారీ స్కోరర్‌గా నిలువగా.. అంకిత్ (6) రాణించాడు. పాంథర్స్ రైడర్లు అర్జున్ (14 పాయింట్లు), బిజేంద్ర సింగ్ (8)తో పాటు మిగతా ఆటగాళ్లు తోడవడంతో భారీ స్కోర్‌తో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో సమిష్టి కృషితో బెంగాల్ వారియర్స్ 52-21తో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించి.. ఆరు మ్యాచ్‌ల అనంతరం తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం దబాంగ్ ఢిల్లీతో జరిగే చివరి మ్యాచ్‌లోనైనా తెలుగు టైటాన్స్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
25న ఫైనల్
ఈ లీగ్ తుది ఘట్టానికి చేరుకుంది. ఈనెల 21న ఎలిమినేటర్స్, 23న సెమీ ఫైనల్స్, 25న ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి ప్రకటించాడు.