ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమాతో కుర్రకారులకు సెగలు పుట్టించింది. రొమాన్స్, ముద్దు సన్నివేశాల్లో హీరో కార్తికేయతో పోటీ పడుతూ నటించింది. పాయల్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఆర్డీఎక్స్ 100 అనే సినిమాలోను పాయల్ రాజ్‌పుత్ రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. కాని ఈ సినిమా పాయల్‌కు పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్ తరచు హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం పాయల్ షేర్ చేసిన హాట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.