Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో థియేటర్లలో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి-జ్యోతి కృష్ణలు దర్శకత్వం వహించగా, జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలు కావడంతో , సినిమా ఫీవర్ మొదటి రోజే పెరిగిపోయింది. సినిమాకు వస్తున్నరెస్పాన్స్ చూసి, మేకర్స్ నిన్న (జూలై 24) హైదరాబాద్‌లో ఒక సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరై అభిమానులను ఆశ్చర్యపరిచారు. తాను తన 29 ఏళ్ల సినీ జీవితంలో తొలిసారిగా ఒక సినిమా సక్సెస్ మీట్‌కు హాజరయినట్టు తెలిపారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్న సమయంలో నటి నివితను గుర్తించి, “మీరు ఈ సినిమాలోనే నటించారా?” అని ప్రశ్నించారు. ఆమె “అవును” అని చెప్పగానే, “మీరు చాలా బాగా నటించారు” అని మెచ్చుకున్నారు. పవన్ మాటలతో ఎంతో ఆనందపడిన నివిత.. ఒక ఫొటో కావాలని అడిగారు.పవన్ రమ్మని చెప్పడంతో వేదికపైకి వచ్చిన ఆమె పవన్ కళ్యాణ్ కాళ్లకు మొక్కేందుకు ప్రయత్నించగా, వెంటనే వద్దు అని ఆపేశారు పవన్. ఆ తర్వాత ఆమెతో ఫోటో దిగారు. ఆ ఫోటో దిగిన తర్వాత నివిత ఆనందంతో గంతులు వేసింది. ఆ క్షణం తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నివిత పవన్ గురించి మాట్లాడుతూ.. పవన్ గారు చాలా సింపుల్, స్వీట్ పర్సన్. వెంకటేశ్వర స్వామిలా, ‘మ్యాన్ ఆఫ్ గాడ్’ లా ఉంటారు. ఆయన ఇచ్చే టిప్స్ కోసం టెక్నీషియన్స్ అంతా ఎదురుచూస్తుంటారు. షూటింగ్ టైమ్ లో చాలా స్ట్రెస్ కనిపించారని.. రాజకీయాల వల్ల ఫుల్ బిజీగా ఉన్నారని పేర్కొంది నివిత. మొత్తానికి పవన్ కళ్యాణ్ దృష్టిలో పడ్డ ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. నివిత గురించి అందరు ఆరాలు తీస్తున్నారు. ఏయే సినిమాలలో నటించింది. హరిహర వీరమల్లులో ఏ సీన్లో కనిపించిందని ఆలోచనలు చేస్తున్నారు.