Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Instagram Reels | రీల్స్ పిచ్చితో కెమెరా ముందు వీడియోలు తీసుకోవడంలో నిమగ్నమైన తల్లిదండ్రులు పాపను పట్టించుకోలేదు. దీంతో సముద్రపు అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని గమనించి ఓ యువకుడు వెంటనే స్పందించి కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది.
Instagram Reels | సోషల్ మీడియా రీల్స్ పిచ్చి ఎంత ప్రమాదకరంగా మారుతుందో తెలిపే ఘటన ఒకటి నెట్టింట చర్చనీయాంశమైంది. బీచ్లో భార్యాభర్తలు రీల్స్ చిత్రీకరిస్తుండగా.. వారి చిన్నారి సముద్రపు అలల మధ్య చిక్కుకుంది. కెమెరా ముందు వీడియోలు తీసుకోవడంలో నిమగ్నమైన తల్లిదండ్రులు పాపను పట్టించుకోలేదు. అయితే, అక్కడే ఉన్న ఓ యువకుడు వెంటనే స్పందించి చిన్నారిని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది.
వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. ఓ జంట బీచ్లో సెల్ఫీ స్టిక్ సాయంతో రీల్స్ చిత్రీకరిస్తోంది. అదే సమయంలో వారి చిన్నారి సముద్రపు అలల సమీపంలో ఒంటరిగా ఉండిపోయింది. అలల తాకిడికి పాప నీటిలోకి కొట్టుకుపోతుండగా.. తల్లిదండ్రులు మాత్రం వీడియో చిత్రీకరణలోనే నిమగ్నమైనట్లు కనిపిస్తోంది.
చిన్నారి అలల ధాటికి నీటిలోకి కొట్టుకుపోతున్న విషయాన్ని గమనించిన ఓ యువకుడు వెంటనే స్పందించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాప దగ్గరకు వెళ్లి, ఆమె చేయి పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. అతడి సమయస్ఫూర్తితో చిన్నారికి పెను ప్రమాదం తప్పినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్లిదండ్రుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారి భద్రత కంటే రీల్స్ చిత్రీకరణకే ప్రాధాన్యం ఇవ్వడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఉండేవాళ్లు పిల్లలను కనొద్దంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఆ యువకుడి చొరవను ప్రశంసిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

