నర్మెట్ట వద్ద పామ్ ఆయిల్ కర్మాగారం : మంత్రి నిరంజన్‌రెడ్డి

సిద్దిపేట : జిల్లాలోని నర్మెట్ట వద్ద పామ్ ఆయిల్ కర్మాగారం స్థాపించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సిద్దిపేట పర్యటనలో ఉన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాను రాష్ట్ర ఆయిల్ ఫెడ్‌కు ఇచ్చినట్లు చెప్పారు. రైతాంగానికి అయిల్ పామ్ సాగు కల్పవృక్షం అన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతన్నలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అన్ని రకాల నేలలు ఈ పంట సాగుకు అనుకూలమని తెలిపారు. తక్కువ పెట్టుబడితో 30 ఎండ్ల వరకు స్థిర ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. పామ్ ఆయిల్ సాగును తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణలో 4 ఎండ్లలో 8 లక్షల ఎకరాలలో పామ్ ఆయిల్ పంట సాగుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్న మంత్రి గడువులోగా నిర్దేశిత లక్ష్యం పూర్తి చేస్తే మరో 10 లక్షల ఎకరాలలో పంట సాగుకు ఆమోదం పొందే వీలుందన్నారు.
ఎకరా వరి సాగు నీటితో మూడెకరాల పామ్ఆయిల్ సాగు..
ఎకరా వరి సాగయ్యే నీటితో మూడెకరాల పామ్ ఆయిల్ సాగు చేయవచ్చని మంత్రి తెలిపారు. ఈ పంటకు చీడ పీడలు, కోతులు, అడవి పందుల బెడద లేదన్నారు. అంతరపంటల సాగుతో అధిక లాభాలు పొందొచ్చన్నారు. 4 సంవత్సరాల కాలం పాటు పామ్ ఆయిల్ పంట సాగుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం సబ్సీడీల రూపంలో వివిధ రకాలుగా రైతులకు అందజేయాలని యోచించినట్లు తెలిపారు. ప్రభుత్వ రాయితీ, నాబార్డ్ ద్వారా రుణ సౌకర్యం, ఉద్యానవన శాఖ ద్వారా డ్రిప్ సౌకర్యం, కంపెనీల బై బ్యాక్ గ్యారంటీ వంటి సౌకర్యాల కల్పనతో ఈ పంట సాగు చేసే రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
వంటనూనెలలో పోల్చితే పామాయిల్ తక్కువ ధరకు లభిస్తుండడం వల్ల భారతదేశంలో దీని వాడకం ఎక్కువగా ఉందన్నారు. దేశంలో 21 మిలియన్ టన్నుల వంటనూనెలు అవసరం కాగా.. ఉత్పత్తి మాత్రం 7 మిలియన్ టన్నులు మాత్రమే జరుగుతుందన్నారు. రూ.75 వేల కోట్లు వెచ్చించి దేశంలోకి వంటనూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ మొత్తం దిగుమతులలో 60 శాతం పామాయిల్ కావడం గమనార్హం అన్నారు. 8.4 మిలియన్ టన్నుల పామాయిల్‌ను రూ.40 వేల కోట్లు వెచ్చించి దిగుమతి చేసుకోవడం జరుగుతుందన్నారు. దేశంలో మరో 28 లక్షల హెక్టార్లలో పామాయిల్ సాగును చేపట్టడం ద్వారా భారత్ స్వాలవంబన దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

