Kainat Imtiaz : అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థాన్ పేసర్ కైనత్ ఇంతియాజ్(Kainat Imtiaz) వీడ్కోలు పలికింది. పదమూడేళ్ల పాటు జట్టుకు సేవలందించిన తను సుదీర్ఘ కెరీర్‌ను ముగిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. మూడేళ్ల క్రితం చివరి మ్యాచ్ ఆడిన తను ఇక అవకాశాలు రావని తెలిసి ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై తన తల్లి సలీమా ఇంతియాజ్(Saleema Imtiaz) బాటలో నడవాలని అనుకుంటుంది తను. అమ్మ మాదిరిగానే తాను కూడా మ్యాచ్ రిఫరీ కావాలనే ఉద్దేశంతోనే ఆటకు అల్విదా చెప్పానని కైనత్ పేర్కొంది.
పాకిస్థాన్ మహిళా క్రికెటర్ కైనత్ ఇంతియాజ్ రిటైర్మెంట్ ప్రకటించింది. దాదాపు పదమూడేళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించిన తను ఆదివారం అల్విదా చెప్పేసింది. తదుపరి మ్యాచ్ రిఫరీగా కొనసాగాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పింది. అమ్మ సలీమా ఇంతియాజ్ తరహాలోనే తను కూడా అంతర్జాతీయంగా రిఫరీగా రాణించాలని భావిస్తున్నట్టు పేర్కొందీ పేసర్. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించిన జాతీయ మహిళల అండర్-19 టోర్నమెంట్లో రిఫరీగా వ్యవహరించింది ఇంతియాజ్.
Pakistan pace bowler Kainat Imtiaz has announced retirement from international cricket to pursue a career as a match referee.
The right-arm quick played 19 ODIs and 21 T20Is in a career that spanned 13 years.
More details: https://t.co/7swu5LaVav https://t.co/svcAl8bWyb
— Cricinfo (@cricinfo) October 4, 2026
కుడిచేతివాటం పేసరైన ఇంతియాజ్ 2010లో దక్షిణాఫ్రికాపై టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిసింది. ఆపై ఐర్లాండ్ మ్యాచ్‌తో వన్డేల్లో డెబ్యూ క్యాప్ అందుకుంది. అయితే.. ఎందుకనో తనకు పెద్దగా అవకాశాలు రాలేదు. పదమూడేళ్ల కాలంలో తను కేవలం19 వన్డేలు, 21 టీ20లు ఆడిందంతే. వన్డేల్లో 10 వికెట్లు.. పొట్టి క్రికెట్లో ఎనిమిది వికెట్లు తీసింది. దేశం తరఫున ఆడింది కొన్ని మ్యా